Home / MOVIES / గాడ్ ఫాదర్ లో నయనతార ఫస్ట్ లుక్ అదుర్శ్

గాడ్ ఫాదర్ లో నయనతార ఫస్ట్ లుక్ అదుర్శ్

సినిమా ఇండస్ట్రీకి చెందిన లేడీ సూప‌ర్ స్టార్ హీరోయిన్.. ఇటీవల ప్రేమించినవాడ్ని పెళ్లి చేసుకున్న నల్లకలువ బ్యూటీ న‌య‌న‌తార గురించి ప్ర‌త్యేకించి చెప్ప‌న‌వ‌స‌రం లేదు. గడిచిన ప‌దిహేనేళ్ళుగా సౌత్ ఇండ‌స్ట్రీలో స్టార్ హీరోయిన్‌గా కొన‌సాగుతూ ఉంది. అంతేకాకుండా ద‌క్షిణాదిన‌ అత్య‌ధిక పారితోషికం అందుకుంటున్న హీరోయిన్‌గా న‌య‌న్ రికార్డు క్రియేట్ చేసింది. ప్ర‌స్తుతం ఈమె చేతిలో అర‌డ‌జ‌ను సినిమాలున్నాయి. అందులో సీనియర్ స్టార్ హీరో.. మెగాస్టార్  చిరంజీవి ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ‘గాడ్‌ఫాద‌ర్’ ఒక‌టి.

 ఈ చిత్రం మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్ట‌యిన ‘లూసీఫ‌ర్‌’కు రీమేక్‌గా తెరకెక్కింది. ప్రముఖ దర్శకుడు మోహ‌న్ రాజా ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రం ద‌స‌రా కానుక‌గా అక్టోబ‌ర్ 5న విడుద‌ల కానుంది. ఈ క్ర‌మంలో మేక‌ర్స్ వ‌రుస‌గా అప్‌డేట్‌ల‌ను ప్ర‌క‌టిస్తూ సినిమాపై క్యూరియాసిటీని పెంచుతున్నారు.

తాజాగా ఈ చిత్రంలోని న‌య‌న‌తార పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు.లేటెస్ట్‌గా విడుద‌లైన న‌య‌న‌తార లుక్‌కు ప్రేక్ష‌కుల నుండి విశేష స్పంద‌న వ‌స్తుంది. ఈ చిత్రంలో న‌య‌న తార స‌త్య‌ప్రియ జ‌య‌దేవ్‌గా క‌నిపించనుంది. లూసీఫ‌ర్‌లో మంజు వారియ‌ర్ పోషించిన పాత్రలో న‌య‌న‌తార క‌నిపించ‌నుంది. ఈ చిత్రాన్ని మెగా తనయుడు …స్టార్  హీరో మెగా పవర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌, ఆర్.బి.చౌద‌రి, ప్ర‌సాద్ ఎన్‌వి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. స‌ల్మాన్‌ఖాన్ ముఖ్య పాత్ర‌లో న‌టించిన ఈ చిత్రంలో న‌య‌న‌తార‌, స‌త్య‌దేవ్‌లు కీల‌క‌పాత్ర‌లు పోషించారు ఎస్ఎస్ థ‌మ‌న్ సంగీతాన్ని అందిస్తున్నాడు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat