తెలంగాణ రాష్ట్రంలో నేడు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణశాఖ హెచ్చరించింది. అదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, నిర్మల్, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురవనున్నట్లు తెలిపింది. మిగిలిన జిల్లాల్లో కూడా వర్షం పడుతుందని చెప్పింది వాతావరణశాఖ. సిటీలోనూ ఉరుములు మెరుపులతో కొన్ని చోట్ల భారీ వర్షం కురుస్తుందని తెలిపింది. కర్ణాటక, దక్షిణ తెలంగాణ, ఉత్తర కోస్తా మీదగా బంగాళఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని సూచించింది. దీని ప్రభావంతో నేడు, రేపు వర్షాలు కురుస్తాయని తెలిపింది.
Tags city climate Forest and Climate Change full rains Heavy Rain Alert hyderabad climate rain rains ts water