Home / SLIDER / మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా కోహ్లీ

మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా కోహ్లీ

ఆసియాకప్‌ నామమాత్రమైన మ్యాచ్‌లో భారత ఆటగాళ్ల నుంచి అత్యద్భుత ప్రదర్శన. ఓవైపు అంతర్జాతీయ టీ20ల్లో విరాట్‌ కోహ్లీ (61 బంతుల్లో 12 ఫోర్లు, 6 సిక్సర్లతో 122 నాటౌట్‌) తొలి శతకంతో చెలరేగగా.. బౌలింగ్‌లో పేసర్‌ భువనేశ్వర్‌ (4-1-4-5) నిప్పులు చెరిగే బంతులతో తన ఉత్తమ గణాంకాలను నమోదు చేశాడు.

వీరిద్దరి ధాటికి గురువారం జరిగిన మ్యాచ్‌లో అఫ్ఘానిస్థాన్‌ 101 రన్స్‌ తేడాతో చిత్తుగా ఓడింది. అలాగే టీమిండియా ఆసియాక్‌పను ఓ భారీ విజయంతో ముగించినట్టయ్యింది.ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ 20 ఓవర్లలో 2 వికెట్లకు 212 పరుగులు చేసింది.

రోహిత్‌ స్థానంలో కెప్టెన్సీ చేసిన రాహుల్‌ (62) అర్ధసెంచరీ సాధించాడు. ఆ తర్వాత ఛేదనలో అఫ్ఘాన్‌ 20 ఓవర్లలో 8 వికెట్లకు 111 పరుగులు చేసి ఓడింది. జద్రాన్‌ (64 నాటౌట్‌) మాత్రం ఆఖరి వరకు నిలిచాడు. ఇక తన తొలి రెండు ఓవర్లలోనే నాలుగు వికెట్లు తీసిన భువీ ఆ జట్టును పరుగులు తీసేందుకే భయపడేలా చేశాడు. 21/6తో ఉన్న జట్టు జద్రాన్‌ ఆలౌట్‌ కాకుండా కాపాడాడు. మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా కోహ్లీ నిలిచాడు.

సంక్షిప్త స్కోర్లు: 

భారత్‌:

20 ఓవర్లలో 212/2 (కేఎల్‌ రాహుల్‌ 62, విరాట్‌ కోహ్లీ 122 నాటౌట్‌, పంత్‌ 20 నాటౌట్‌, ఫరీద్‌ 2/57).

అఫ్ఘానిస్థాన్‌:

20 ఓవర్లలో 111/8 (జర్దాన్‌ 64 నాటౌట్‌, ముజీబుర్‌ 18, భువనేశ్వర్‌ 5/4, దీపక్‌ హుడా 1/3, అర్ష్‌దీప్‌ 1/7).

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat