Home / MOVIES / తార్‌మార్ తక్కర్‌మార్.. దుమ్ములేపిన మెగాస్టార్, సల్మాన్..!

తార్‌మార్ తక్కర్‌మార్.. దుమ్ములేపిన మెగాస్టార్, సల్మాన్..!

మోహన్ రాజ్ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న చిత్రం గాడ్‌ఫాదర్. త్వరలో ప్రేక్షకులను అలరించనున్న ఈ మూవీకి సంబంధించిన ఓ ఇంట్రస్టింగ్ అప్డేట్ పంచుకుంది మూవీ టీమ్. ఇందులో చిరు, సల్మాన్ కలిసి అదిరిపోయే మాస్ బీట్‌కు స్టెప్పులేశారు. తమన్ స్వరపరిచిన తార్‌మార్.. అంటూ సాగే ఓ పాటకు సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేశారు చిత్రబృందం. ఫ్యాన్స్ తార్‌మార్ తక్కర్‌మార్ అంటూ నెట్టింట రచ్చ రచ్చ చేస్తున్నారు. అయితే ఈ పూర్తి పాట రేపు(15న) రానుంది.

రీసెంట్‌గా మెగాస్టార్ బర్త్‌డే కానుకగా విడుదలైన ఈ మూవీ టీజర్ విశేషంగా ఆకట్టుకుంది. దీంతో ప్రేక్షకుల్లో ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోతున్నాయి. మూవీలో చిరు ఫస్ట్‌లుక్ పోస్టర్ ఓ రేంజ్‌లో ఆకట్టుకోగా తాజాగా ఇందులోని స్టెప్పులతో అదరగొట్టారు మెగాస్టార్. సల్మాన్ ఖాన్‌తో పాటు సత్యదేవ్, నయనతార, మూవీలో కీలక పాత్రలో నటిస్తున్నారు. దసరా కానుకగా అక్టోబరు 5న ఈ మూవీ రిలీజ్ కానుంది.

Image

Image

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat