Home / SLIDER / నిరుద్యోగ యువతకు మంత్రి హరీష్ రావు శుభవార్త.

నిరుద్యోగ యువతకు మంత్రి హరీష్ రావు శుభవార్త.

తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రివర్యులు తన్నీరు హరీష్ రావు గారి  చొరవ తో సిద్దిపేట లో ప్రముఖ కంపనీ అయిన ఎల్ అండ్ టి వారి సహకారం తో సిద్దిపేట లో నిరుద్యోగ యువకుల కోసం శిక్షణ కేంద్రం ఏర్పాటు కానుంది.. ఈ సందర్భంగా సిద్దిపేట లోని డబుల్ బెడ్రూం కేసీఆర్ నగర్ లో ఎల్ అండ్ టి (L&T) సహకారం తో నిరుద్యోగ యువకుల కోసం వృత్తి నైపుణ్యం పై శిక్షణ కేంద్రం ఏర్పాటు చేస్తున్నారు.

ఎల్ అండ్ టి దేశంలోనే ఎంతో పేరుగాంచిన కంపనీ అని వారి సహకారంతో సిద్దిపేట నియోజకవర్గ యువకలకు వృత్తి నైపుణ్యత పై శిక్షణ ఇచ్చి ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారందరికి ఆ కంపెనీ నే ఉపాధి అవకాశాన్ని కల్పిస్తుంది.. అదే విధంగా శిక్షణ పొందిన సర్టిఫికెట్ పొందిన వారు దేశ విదేశాల్లో ఉద్యోగ ఉపాధి పొందేందుకు అర్హులు .

5 వ తరగతి ఆ పై చదువు కున్న వారు 18 సం నుండి 35 సం వయస్సు గల వారు ఇందుకు అర్హులు.. ఐటీఐ చదువుకున్న వారికి మంచి అవకాశాలు కల్పించనున్నారు. ఇందులో కార్పెంటర్ , సెంట్రింగ్ , మెస్ట్రీ , ఎలెక్ట్రిషన్ , ప్లంబర్ సానిటరీ లాంటి వాటికి శిక్షణ ఇవ్వనున్నారు.. ఆసక్తి గల వారు సిద్దిపేట మంత్రి క్యాంపు కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలి.. ఇట్టి సదవకాశాన్నీ సద్వినియోగం చేసుకోవాలని సిద్దిపేట నియోజకవర్గ యువకులను కురుతున్నాము..

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat