కొన్నేండ్లుగా వరుస సినిమాలతో.. హిట్ చిత్రాలతో హాటెస్ట్ హీరోయిన్.. కుర్రకారు గుండెల్లో గుడి కట్టుకున్న యువరాణి సమంత అగ్రతారగా వెలిగింది. ఇటీవల విడుదలైన ‘ఫ్యామిలీ మ్యాన్ 2’, ‘పుష్ప’ సినిమాలు ఆమెకు బాలీవుడ్లోనూ పేరు తీసుకొచ్చాయి.
ఇక్కడిలాగే అక్కడా అభిమానులను, పాపులారిటీని అందించాయి.దీంతో ఆమెకు కొన్ని ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ క్యూ కడుతున్నాయి. హాలీవుడ్ డైరెక్టర్స్ రూసో బ్రదర్స్ చేసిన ‘సిటాడెల్’ హిందీ రీమేక్ ఇప్పటికే సెట్స్ మీద ఉండగా…తాజాగా మరో క్రేజీ మూవీ ఆఫర్ దక్కింది. దినేష్ విజన్ మ్యాడాక్ ఫిలింస్ సంస్థలో రాబోతున్న హారర్ కామెడీలో సమంత నాయికగా ఎంపికైంది.
ఈ సంస్థ గతంలో ‘స్త్రీ’, ‘బేడియా’ వంటి విజయవంతమైన హారర్ చిత్రాలను నిర్మించింది. ఈ సినిమాలో ఆమె యువరాణి పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తున్నది. ఆయుష్మాన్ ఖురానా వ్యాంపైర్గా కనిపించబోతున్నారు. ఈ సినిమాకు అమర్ కౌశిక్ దర్శకత్వం వహించనున్నారు. యువరాణిగా సమంత పాత్ర ఆసక్తికరంగా ఉంటుందని చిత్రబృందం చెబుతున్నారు. ప్రస్తుతం సామ్…‘ఖుషీ’, ‘శాకుంతలం’, ‘యశోద’ వంటి చిత్రాల్లో ఈ భామ నటిస్తున్నది.