Breaking News
Home / CRIME / సగం గడ్డం.. తీసింది ఇద్దరి ప్రాణం

సగం గడ్డం.. తీసింది ఇద్దరి ప్రాణం

మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా కిన్వట్ సమీపంలోని భోది గ్రామంలో గురువారం రాత్రి దారుణం చోటుచేసుకుంది. సెలూన్ షాపులో జరిగిన ఓ చిన్న గొడవకు రెండు హత్యలు జరిగాయి.

భోది గ్రామంలోని అనిల్ మారుతి శిందే సెలూన్‌కు 22 ఏళ్ల వెంకట్ సురేశ్ దేవ్‌కర్ గడ్డం గీయించుకోవడానికి వచ్చాడు. సగం షేవింగ్ పూర్తి అవ్వగా అనిల్ డబ్బులు అడిగాడు. షేవింగ్ పూర్తి అయితే ఇస్తానని వెంకట్ సురేశ్ చెప్పినప్పటికీ అనిల్ ఇవ్వాల్సిందే అన్నాడు. దీంతో ఇద్దరి మధ్య మాటామాట పెరిగి గొడవ జరిగింది. ఆవేశంతో అనిల్ అక్కడే ఉన్న షేవింగ్ కిట్‌లోని ఆయుధాలతో వెంకట్ గొంతు కోసేశాడు. తీవ్ర రక్తస్రావంతో వెంకట్ అక్కడికక్కడే మృతిచెందాడు. విషయం తెలుసుకున్న వెంకట్ బంధువులు సెలూన్ షాపును తగలబెట్టారు. అక్కడినుంచి పారిపోయిన అనిల్‌ను వెతికిపట్టుకొని మరీ గ్రామంలోని మార్కెట్ దగ్గర కొట్టి చంపేశారు. అంతటితో ఆగకుండా అనిల్ ఇంటిని కూడా తగలబెట్టేశారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino