Home / HYDERBAAD / కుత్భుల్లాపూర్ నియోజకవర్గంలో కాలనీలను ఆదర్శంగా తీర్చిదిద్దడమే ఏకైక లక్ష్యం-ఎమ్మెల్యే Kp

కుత్భుల్లాపూర్ నియోజకవర్గంలో కాలనీలను ఆదర్శంగా తీర్చిదిద్దడమే ఏకైక లక్ష్యం-ఎమ్మెల్యే Kp

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలోని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, జీడిమెట్ల 132 డివిజన్ పరిధిలోని ఎంఎన్ రెడ్డి నగర్ ఫేస్-1 లో రూ.1.5 కోట్లతో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్లను ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించారు.

అనంతరం రూ.10 లక్షలతో నూతనంగా చేపడుతున్న కమిటీ హాల్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుకుంటూ ముందుకు సాగుతున్నామని అన్నారు.

గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో.. పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ గారి సహకారంతో అభివృద్ధి పనులకు నిధుల కొరత లేదన్నారు. ఎన్ని కోట్లయినా వెచ్చించి కాలనీలను ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు నిరంతరం కృషి చేస్తున్నామని చెప్పారు. గత పాలకుల హయాంలో కాలనీలు అభివృద్ధికి నోచుకోలేదని, టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి కాలనీలో మెరుగైన మౌలిక వసతులు కల్పిస్తున్నామన్నారు. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచడమే టీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యమన్నారు.

గత ఏడాది కాలంలోనే రూ.3.37 కోట్లతో కాలనీలో భూగర్భ డ్రైనేజీ, మంచినీటి వ్యవస్థ, సీసీ రోడ్లు, కమిటీ హాల్ అభివృద్ధికి సహకారం అందించిన సందర్భంగా కాలనీవాసులు హర్షం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారిని ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. అడిగిన వెంటనే కోట్ల రూపాయలను మంజూరు చేసి కాలనీ అభివృద్ధికి పూర్తి సహాయ సహకారాలు అందించిన నేపథ్యంలో కాలనీ వాసులంతా రాబోయే రోజుల్లో తన వెంటే ఉండి మూడవ సారి భారీ మెజారిటీతో గెలిపించేందుకు కృషి చేస్తామని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో కాలనీ సంక్షేమ సంఘం ప్రెసిడెంట్ సంపత్ గౌడ్, టీఆర్ఎస్ ప్రెసిడెంట్ సందు శ్రీనివాస్, ఎల్లగౌడ్, ఇస్మాయిల్, రవీందర్ గౌడ్, పరమేష్, బాపు రెడ్డి, విజయ్ కుమార్, బిక్షపతి, కరుణాకర్ రెడ్డి, బాలచందర్, జుబేర్, కుమార్, శ్రీకాంత్ రెడ్డి, శివ రామకృష్ణ మరియు నియోజకవర్గ టిఆర్ఎస్ యూత్ ప్రెసిడెంట్ సోమేశ్ యాదవ్, వార్డు సభ్యుడు సుధాకర్ గౌడ్, స్థానిక సీనియర్ నాయకులు కుంట సిద్ధిరాములు, గుమ్మడి మధుసూదన్ రాజు, జ్ఞానేశ్వర్, నరేందర్ రెడ్డి, డివిజన్ అధ్యక్షులు పుప్పాల భాస్కర్, దేవరకొండ శ్రీనివాస్, శ్రీకాంత్, రాముడు యాదవ్, విజయ్ హరీష్, రాజు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

aviator hile paralislot.com lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri