Home / ANDHRAPRADESH / ఇది కుప్పమా? పులివెందులా?: మంత్రి రోజా

ఇది కుప్పమా? పులివెందులా?: మంత్రి రోజా

ప్రతిపక్ష నేత చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పం ప్రజలు సీఎం జగన్‌కు బ్రహ్మరథం పడుతున్నారని మంత్రి ఆర్కే రోజా అన్నారు. ‘వైఎస్‌ఆర్‌ చేయూత’ నిధులు విడుదల కార్యక్రమంలో కుప్పంలో నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి జగన్‌ ముఖ్యఅతిథిగా హాజరై లబ్ధిదారుల ఖాతాల్లోకి నేరుగా నిధులను విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి రోజా మీడియాతో మాట్లాడారు.

చంద్రబాబు, నారా లోకేశ్‌ కుప్పంలో వీధివీధి తిరిగినా మున్సిపల్‌ ఎన్నికల్లో టీడీపిని ప్రజలు ఓడించారని చెప్పారు. సీఎంగా ఉంటూ గత 30 ఏళ్లలో చంద్రబాబు చేయనిది కేవలం మూడేళ్లలోనే కుప్పం అభివృద్ధికి జగన్‌ ఎన్నో కార్యక్రమాలు చేశారని వివరించారు.

కుప్పం ప్రజలు జగన్‌ను విశేషంగా ఆదరిస్తూ ఘన స్వాగతం పలుకుతున్నారు. జగన్‌ రాకతో ఇది కుప్పమా? పులివెందులా? అన్నట్టుగా కుప్పంలో పరిస్థితి ఉందని చెప్పారు. వచ్చే ఎన్నికల్లోనూ కుప్పం నుంచి కురుపాం వరకు, చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకు ఎగిరేది వైసీపీ జెండానే అని రోజా ధీమా వ్యక్తం చేశారు.

aviator hile paralislot.com lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri