తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల మరియు మున్సిపల్ శాఖ మంత్రివర్యులు.. టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు ఈ రోజు సోమవారం రాష్ట్రంలోని ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈరోజు ఉదయం 9 గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి 10 గంటలకు ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలోని దీపాయిగూడకు చేరుకుంటారు.
ఇటీవల ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న మాతృమూర్తి జోగు భోజమ్మ మరణించారు. దీంతో ఆయన కుటుంబ సభ్యులను మంత్రి కేటీఆర్ పరామర్శిస్తారు.అనంతరం రోడ్డు మార్గం ద్వారా 11.30 గంటలకు ఆదిలాబాద్ పట్టణానికి చేరుకుంటారు.
బీడీఎన్‌టీ ల్యాబ్స్, ఎన్‌టీటీ డాటా బిజినెస్ సొల్యూషన్స్ ఐటీ టవర్స్ ఉద్యోగులతో సమావేశమవుతారు. మధ్యాహ్నం 12.30 గంటలకు ఆదిలాబాద్ నుంచి బయలుదేరి ఒంటి గంటకు నిర్మల్ జిల్లా బాసర చేరుకుంటారు. ట్రిపుల్ ఐటీ విద్యార్థులతో భేటీ అనంతరం వారితో కలిసి భోజనం చేస్తారు. 3 గంటలకు హైదరాబాద్ బయలుదేరుతారు. మంత్రి కేటీఆర్‌తోపాటు మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి కూడా పర్యటించనున్నారు.