లూసిఫర్ కంటే గాడ్‌ఫాదర్ సినిమా చాలా బాగుంది అని ఆ మూవీ డైరెక్టర్ మోహన్ రాజ్ తండ్రి, ప్రముఖ ఎడిటర్ మోహన్ అన్నారు. మెగాస్టార్ చిరంజీవి గాడ్‌ఫాదర్ మూవీ సక్సెస్ అవ్వగా తాజాగా ఓ ఇంటర్వూలో మోహన్ ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు.
లూసీఫర్ మూవీ కంటే గాడ్‌ఫాదర్ రోల్ కింగ్‌లా ఉంటుందని అన్నారు. టీమ్ అంతా కలిసి గాడ్‌ఫాదర్‌ను అద్భుతంగా తీర్చిదిద్దారని కొనియాడారు. లూసిఫర్ సినిమాను మహిళలు ఇష్టపడతారో లేదో అని ఉండేదని కానీ గాడ్‌ఫాదర్ మహిళలకు తప్పకుండా నచ్చుతుందని చెప్పారు. గాడ్‌ఫాదర్ మూవీని ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువగా ఇష్టపడతారని తెలిపారు. తాను పనిచేసిన సినిమా రిలీజ్ అయితే ఎలా ఉందోఅని థియేటర్లో ఓ మూల నిల్చొని చూసే మోహన్.. ఈమూవీని ప్రేక్షకులతో పాటు థియేటర్లో చూశానని చెప్పారు. సినిమా థియేటర్లో ఆడియన్స్ కనీసం పక్కన ఎవరు ఉన్నారో కూడా పట్టించుకోకుండా మూవీలో లీనమైపోయారని అన్నారు. సినిమా రెస్పాన్స్, కలెక్షన్స్ చూస్తుంటే మెగాస్టార్ ఎప్పటికీ బాక్సాఫీస్ ఘరానామొగుడే అని ఆయన ఎప్పటికీ కింగే అని అన్నారు.