Home / MOVIES / పెళ్లికి నో చెప్పిందని నరికి చంపేశాడు!

పెళ్లికి నో చెప్పిందని నరికి చంపేశాడు!

 కాకినాడ జిల్లా పెదపూడి మండలం కాండ్రేగుల-కూరాడ నడిరోడ్డుపై దారుణం జరిగింది. ప్రేమించిన అమ్మాయి పెళ్లి చేసుకోనని చెప్పిందని ఆగ్రహంతో ఓ యువకుడు ఆమెను అతి కిరాతకంగా నరికి చంపేశాడో యువకుడు.

 కాకినాడ జిల్లా కరప మండలం కూరాడలో అమ్మమ్మ ఇంటి దగ్గర ఉంటున్న దేవిక డిగ్రీ పూర్తి చేసి కానిస్టేబుల్ ఉద్యోగం లక్ష్యంగా కృషి చేస్తోంది. దేవిక తల్లిదండ్రులు రాంబాబు, నాగమణి. వీరి సొంత ఊరు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పామర్రు మండలం కే గంగవరం. దేవిక తల్లిదండ్రులు హైదారాబాద్ ఉంటూ పెద్ద కూతురును అక్కడే బీటెక్ చదివిస్తున్నారు.

 రంగం పేట మండలం బాలవరానికి చెందిన గుబ్బల వెంకట సూర్యనారాయణ డిప్లొమా చదివి, కాకినాడ పోర్టులో పనిచేసి ప్రస్తుతం ఖాళీగా ఉన్నాడు. వెంకట సూర్యనారాయణ మేనమామ రామచంద్రరావు ఇంటి వద్ద ఉంటున్నాడు. ఈ క్రమంలో దేవిక, సూర్యనారాయణ ప్రేమించుకున్నారు. ఇరు కుటుంబాలకు ఈ విషయం తెలిసి పెళ్లి గురించి మాట్లాడుకున్నారు. అయితే దేవిక తల్లిదండ్రులు పెళ్లికి నిరాకరించారు. సూర్యనారాయణ మేనమామ కూడా వెళ్లి మరోసారి దేవిక తల్లిదండ్రులతో పెళ్లి గురించి మాట్లాడగా అప్పుడు దేవిక నో చెప్పేసింది. దీంతో సూర్యనారాయణను మేనమామ హైదరాబాద్ పంపేశాడు.

ప్రియురాలిని చంపేయాలని పక్కా ప్లాన్

ఆమె వేరేవారితో క్లోజ్‌గా ఉందని అనుకొన్న సూర్యనారాయణ తిరిగి కాండ్రేగుల చేరుకొని ఆమెను చంపేయాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకు శనివారం ఉదయం ఆమె స్కూటీపై కరప వెళ్లి తిరిగి వస్తుండగా ఆమెను ఆపి పెళ్లి చేసుకోవాలని కోరాడు. దేవిక నిరాకరించడంతో తన వెంట తెచ్చుకున్న కత్తితో ఆమె మెడపై నరికేశాడు. తీవ్ర రక్తస్రావంతో ఆమె కిందపడి గిలగిల కొట్టుకుంటోన్నా కనికరం లేకుండా చేతులు, శరీరంపై నరికాడు. దీంతో ఆమె అపస్మారక స్థితిలోకి చేరుకుంది. గమనించిన రైతులు నిందితుడిని పట్టుకోవడానికి ప్రయత్నించగా నేనే ఎక్కిడికి పారిపోను, తను నన్ను మోసం చేసింది అందుకే చంపేశా.. అని చెప్పాడు. రైతులు నిందితుడిని స్తంభానికి కట్టేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దేవికను 108లో కాకినాడ గవర్నమెంట్ హాస్పిటల్‌కి తీసుకెళ్లగా అప్పటికే ఆమె చనిపోయిందని వైద్యులు తెలిపారు.

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat