నీ భార్య నాకు.. నా భార్య నీకు.. బాగా ఎంజాయ్ చేద్దాం రా.. ఇది ఓ 5 స్టార్ హోటల్ మేనేజర్ కొత్త గేమ్. భార్యల మార్పిడి గేమ్‌కు తన భార్య నిరాకరించడంతో రూమ్‌లో బంధించిన చితక్కొట్టాడో ప్రభుద్దుడు. రాజస్థాన్ బీకానేర్ ప్రాంతంలో జరిగిన ఈ ఘటన బాధితురాలు మధ్యప్రదేశ్‌లోని భోపాల్ పోలీసులను ఆశ్రయించడంతో వెలుగులోకి వచ్చింది.
బీకానేర్ ప్రాంతంలోని ఓ 5 స్టార్ హోటల్లో అమ్మర్ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. ఈయనకు పరాయి స్త్రీల మీద వ్యామోహం ఎక్కువ. అందుకే తన తోటి స్నేహితులకు తన బెడ్రూమ్లోని విషయాలు పంచుకొని వారి విషయాలు తెలుసుకునేవాడు. ఈ క్రమంలో భార్యల మార్పిడి గేమ్ అడుదామని వారి స్నేహితులతో డీల్ పెట్టుకున్నాడు.
అనుకున్నట్లుగానే తన భార్య వద్ద రెండు రోజుల క్రితం సెల్ లాక్కొని ఆమెను ఆ 5 స్టార్ హోటల్లోని ఓ గదిలో బంధించాడు. అనంతరం హోటల్ గదికి వెళ్లి భార్యల మార్పిడి గేమ్ ఆడాలని.. తన చెడు కోరికను భార్యతో పంచుకున్నాడు. దానికి ఆమె నిరాకరించడంతో ఆమెతో అసభ్యంగా మాట్లాడి.. విపరీతంగా కొట్టాడు. అనంతరం ఆమెతో బలవంతంగా సెక్స్ చేశాడు. ఈ మేరకు బాధితురాలు భోపాల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన భర్త అమ్మర్‌కు మందు, డ్రగ్స్‌కు బాగా అలవాటు పడ్డాడని పేర్కొంది. అంతేకాకుండా భారీగా అదనపుకట్నం డిమాండ్ చేస్తూ.. అత్తింటివారు వేధిస్తున్నారని తెలిపింది.