తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో.. యూత్ ఐకాన్ అల్లు అర్జున్ తమ్ముడిగా.. ప్రముఖ స్టార్ నిర్మాత అల్లు అరవింద్ తనయుడుగా తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీచ్చిన యువ హీరో అల్లు శిరీష్.. అయితే గత కొంతకాలంగా అల్లు శిరీష్ మంచి కమర్షియల్ హిట్ మూవీ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నాడు.
తన సినీ కెరీర్ ప్రారంభం నుండి పలు విభిన్న సినిమాలు చేస్తున్నా కానీ అల్లు శిరీష్‌కు మాత్రం భారీ హిట్టు పడలేదు. మధ్యలో ‘కొత్త జంట’, ‘శ్రీరస్తు శుభమస్తు’ వంటి సినిమాలకు పాజిటీవ్ టాక్ వచ్చినా, బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాలు సాధించలేకపోయాయి. ప్రస్తుతం ఈయన ఆశలన్ని ‘ఊర్వసివో రాక్షసివో’ సినిమాపైనే ఉన్నాయి. రాకేష్ శశి దర్శకత్వం వహించిన ఈ చిత్రం నవంబర్ 4న రిలీజ్ కానుంది.
ఇప్పటికే చిత్రం నుండి రిలీజైన పోస్టర్లు, టీజర్ సినిమాపై మంచి అంచనాలు నెలకొల్పాయి. ఇక రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో చిత్రబృందం ప్రమోషన్లను స్టార్ట్ చేసింది.ప్రమోషన్లో భాగంగా శిరీష్ తన సినిమాకు సంబంధించిన విషయాలతో పాటు పర్సనల్ విషయాలను కూడా పంచుకున్నాడు.
శిరీష్‌కు మహేష్‌బాబు అంటే చాలా ఇష్టమని తెలిపాడు. అంతేకాకుండా తను ఒక అమ్మాయిని ప్రేమించానని, బ్రేకప్ కూడా అయిందని వెల్లడించాడు. ప్రస్తుతం ఈయన నటించిన ‘ఊర్వసివో రాక్షసివో’ రోమ్-కామ్ ఎంటర్టైనర్గా తెరకెక్కింది. ఈ చిత్రంలో అల్లు శిరీష్‌కు జోడీగా అనుఇమాన్యూయేల్ నటించింది. అనూప్ రూబెన్స్ సంగీత అందించిన ఈ చిత్రాన్ని చిత్రాన్ని జీఏ-2 పిక్చర్స్, శ్రీ తిరుమల ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. గతేడాదే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం కొన్ని కారణాల వల్ల విడుదల వాయిదా పడుతూ వచ్చింది.