Home / SLIDER / చాపకింద నీరులా విస్తరిస్తున్న రొమ్ము క్యాన్సర్

చాపకింద నీరులా విస్తరిస్తున్న రొమ్ము క్యాన్సర్

మారిన జీవనశైలి, ఆహార అలవాట్ల వల్ల చిన్నతనంలోనే ప్రజలు రోగాల బారిన పడుతున్నారని మంత్రి హరీశ్‌ రావు అన్నారు. ప్రపంచాన్ని భయపెడుతున్న రొమ్ము క్యాన్సర్ విషయంలోనూ ఇదే జరుగుతుందన్నారు. ఒకప్పుడు పెద్ద వయస్సులో మాత్రమే కనిపించే ఈ మహమ్మారి నేడు 30-40 ఏండ్ల వయస్సు వారిలోనూ కనిపిస్తున్నది ఆందోళన వ్యక్తంచేశారు.

వరల్డ్‌ బ్రెస్ట్ర్‌ క్యాన్సర్‌ నెల సందర్భంగా హైదరాబాద్‌ నెక్లెస్‌రోడ్‌లోని జలవిహార్ వద్ద నిర్వహించిన అవగాహన నడన, మారథాన్ మంత్రి హరీశ్‌ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన కల్పించడంలో భాగంగా మారథాన్‌ నిర్వహించడం మంచి ఆలోచన అన్నారు.

జిల్లాల్లోనూ ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని సూచించారు. చాపకింద నీరులా విస్తరిస్తున్న రొమ్ము క్యాన్సర్ గురించి ప్రజలకు అవగాహన కల్పించి, ప్రజలను కాపాడేందుకు ప్రపంచ వ్యాప్తంగా అక్టోబర్ నెలను బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్‌నెస్‌ మంత్‌గా నిర్వహిస్తున్నారని చెప్పారు. మారథాన్‌లో పాల్గొన్నవారికి అభినందనలు తెలిపారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat