ఈరోజు డార్లింగ్ …పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ పుట్టిన రోజు..దీంతో అభిమానులు సంబరాలు మొదలెట్టారు.దీనికితోడు ప్రభాస్ మరో గుడ్ న్యూస్ చెప్పారు.. తాజగా ప్రభాస్ చేతిలో ‘సలార్’, ‘ఆదిపురుష్’, ‘ప్రాజెక్ట్ కె’ చిత్రాలున్నాయి. తాజాగా మారుతి దర్శకత్వంలో మరో సినిమా ప్రారంభమైన సంగతి తెలిసిందే!
అయితే తాజాగా డార్లిం నటిస్తున్న చిత్రాల నుంచి మరో క్రేజీ అప్డేట్ వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ మేరకు ప్రాజెక్ట్ కె దర్శకుడు నాగ్ అశ్విన్ ఇప్పటికే హింట్ ఇచ్చారు. ప్రభాస్ అభిమానులు ఖుషీ అయ్యే వార్తను అందించారు అశ్విన్.
గత ఏడాది ‘ప్రాజెక్ట్ కె’ అప్డేట్ గురించి అడిగితే ‘రాధేశ్యామ్’ తర్వాతే అని నాగ్ అశ్విన్ చెప్పారు. ఇప్పుడు అభిమానులు ‘ఈ ఏడాది అయినా గుర్తున్నామా’ అని అప్పట్టో అడిగిన ట్వీట్‌ను ట్యాగ్ చేసి ఓ అభిమాని అడగగా నాగ్ అశ్విన్ స్పందించారు. ప్రభాస్ పుట్టినరోజు చిన్న అప్డేట్ వస్తుంది అని ఆ ట్వీట్‌కు రిప్లై ఇచ్చారు. ప్రభాస్ సరసన దీపికా పడుకోన్ నటిస్తున్న ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో కనిపిస్తారు. వైజయంతీ మూవీస్ పతాకంపై సి.అశ్వనీదత్ నిర్మిస్తున్నారు.