హేట్‌స్టోరీ-4’ ‘పాగల్పంటి’ వంటి హిట్ చిత్రాలతో బాలీవుడ్ యువతలో మంచి ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది అందాల భామ ఊర్వశి రౌటేలా. అంతేకాకుండా పలు చిత్రాల్లో ఐటెంసాంగ్స్‌లో మెరిసింది . తాజాగా ఈ అమ్మడు హీరో రామ్ సరసన ఓ ప్రత్యేకగీతంలో నర్తించనుంది.
వివరాల్లోకి వెళితే…బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్ ఓ యాక్షన్ ఎంటర్టైనర్లో నటిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ జరుగుతున్నది. ఈ సినిమాలో ఊర్వశి రౌటేలా స్పెషల్‌సాంగ్‌లో కనిపించనుంది. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా వెల్లడించిందీ భామ.
ఈ సందర్భంగా రామ్‌తో కలిసి తీయించుకున్న ఓ ఫొటోను షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటో నెటిజన్లను ఆకట్టుకుంటున్నది. పవర్ఫుల్ మాస్ కథాంశంతో బోయపాటి శ్రీను ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ‘అఖండ’ వంటి అపూర్వ విజయం తర్వాత ఆయన తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది వేసవిలో ప్రేక్షకుల ముందుకురానుంది. ఇదిలావుండగా ఊర్వశి రౌటేలా తెలుగులో నటించిన ‘బ్లాక్‌రోజ్’ చిత్రం చిత్రీకరణ పూర్తిచేసుకుంది.