Home / MOVIES / పవన్ అభిమానులకు శుభవార్త

పవన్ అభిమానులకు శుభవార్త

వకీల్ సాబ్,భీమ్లా నాయక్ మూవీల తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా ప్రముఖ దర్శకుడు  క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ‘హరి హర వీరమల్లు’ చిత్రంలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి విడుదలైన  పోస్టర్‌లు, టీజర్‌ సినిమాపై విపరీతమైన అంచనాలు క్రియేట్‌ చేశాయి. తాజాగా వీరమల్లు చిత్రబృందం హైదరాబాద్‌లో మేజర్‌ షెడ్యూల్‌ను ప్రారంభించింది.

మరోవైపు ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది. ఈ చిత్రం కోసం బాలీవుడ్‌ నటుడు రంగంలోకి దిగినట్లు టాక్‌. బాలీవుడ్‌ టాప్ యాక్టర్‌ బాబీ డియోల్ ఈ చిత్రంలో భాగం కానున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాలో ఔరంగజేబు పాత్ర కోసం క్రిష్‌, బాబీ డియోల్‌ను సంప్రదించినట్లు టాక్. కాగా మొదట ఈ పాత్రను అర్జున్‌ రామ్‌పాల్‌ చేయాల్సి ఉంది. అయితే పవన్ కళ్యాణ్‌కు పొలిటికల్‌ కమిట్‌మెంట్స్‌ ఉండటంతో షూటింగ్‌ ఆలస్యమవుతూ వస్తుంది. ఈ క్రమంలో అర్జున్‌ రామ్‌పాల్‌ ఈ సినిమా నుండి తప్పుకున్నాడట.

ఈ క్రమంలో క్రిష్ ఆ పాత్ర కోసం బాబీ డియోల్‌ను సంప్రదించాడట. పాత్ర నచ్చడంతో బాబీ డియోల్‌ కూడా వెంటనే గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడట. దీనిపై త్వరలోనే అధికారికంగా ప్రకటన వచ్చే చాన్స్ ఉంది.పీరియాడిక్‌ యాక్షన్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ప్రథమార్థంలో రిలీజ్‌ చేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. పవన్‌కు జోడీగా నిధి అగర్వాల్‌, నర్గీస్‌ ఫక్రీ హీరోయిన్‌లుగా నటించనున్నారు. ఈ చిత్రాన్ని మెగా సూర్య ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై ఏ. దయాకర్‌రావు, ఏ.ఎమ్‌ రత్నం అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఎమ్‌.ఎమ్‌ కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని సాయి మాధవ్‌ బుర్రా మాటలు అందిస్తున్నాడు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat