Home / SLIDER / కోహ్లీ పర్సనల్ వీడియో లీక్.. సీరియస్ అయిన క్రికెటర్!

కోహ్లీ పర్సనల్ వీడియో లీక్.. సీరియస్ అయిన క్రికెటర్!

టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి చేదు అనుభవం ఏదురైంది. కోహ్లీ లేని సమయంలో కొందరు ఆయన గదిలోకి వెళ్లి వీడియో తీసి దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్‌ చేశారు. నెట్టింట్లో ఆ వీడియో చూసి షాకైన విరాట్ కోహ్లీ సీరియస్ అయ్యారు.

నిన్న(ఆదివారం) జరిగిన దక్షిణాఫ్రికా, ఇండియా మ్యాచ్‌ కోసం ఆస్ట్రేలియాలోని పెర్త్‌లో కోహ్లీ ఓ హోటల్ రూంలో ఉన్నారు. అయితే కోహ్లీ లేని టైంలో కొందరు ఆయన రూంలో ఆయన డ్రెస్సులు, ఉపయోగించే వస్తువులను వీడియో తీశారు. దాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అవుతుండగా అది విరాట్ కోహ్లీ కంట పడింది. దీనిపై స్పందించిన కోహ్లీ సీరియస్‌ అయ్యి తన ఇస్టాలో ఓ పోస్ట్ చేశారు.

” అభిమానులు తమకు ఇష్టమైన క్రికెటర్లను చూస్తే ఎంతో ఆనందపడతారు. వాళ్లని కలిసేందుకు ఎంతో ఉత్సాహంగా ఉంటారు. ఈ విషయం నేను అర్థం చేసుకోగలను. అలాంటి అభిమానానికి నేను హ్యాపీగా ఫీలవుతా. కానీ ఈ వీడియో చూసి నేను చాలా షాక్ అయ్యా. చాలా భయం వేసింది. నా హోటల్ గదిలోనే నాకు ప్రైవసీ లేకపోతే.. ఇంకెక్కడ నాకు పర్సనల్ ఫ్రీడమ్ ఉంటుందని అనుకోగలను. ఇలాంటి మూర్ఖమైన అభిమానాన్ని నేను యాక్సెప్ట్ చేయలేను. ఇది కచ్చితంగా ప్రైవసీకి భంగం కలిగించడమే. దయచేసీ ప్రతి ఒక్కరి ప్రైవసీకి గౌరవం ఇవ్వండి. ఎవరనీ కామెడీగా చూడొద్దు.”

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat