ఓ వ్యక్తి మరో వ్యక్తి దగ్గర ల్యాప్‌టాప్ దొంగిలించాడు. అనంతరం ల్యాప్‌టాప్ ఓనర్‌కు ఓ ఈ మెయిల్ చేశాడు. అది చూసిన ఓనర్ తన పట్టుకున్నాడు. తన పరిస్థితికి నవ్వాలా.. ఏడ్వాలా అంటూ ట్వీట్ చేశాడు. ఇంతకీ దొంగ ఆయనకు ఏమని ఈమెయిల్ చేశాడంటే..
దక్షిణాఫ్రికాకు చెందిన ఓ ల్యాప్‌టాప్ ఓనర్‌కి జీవితంలో మర్చిపోలేని ఓ వింత అనుభవం ఎదురైంది. ఆయన ల్యాప్‌టాప్‌ను ఓ వ్యక్తి దొంగతనం చేసిందేకాక ఆయననే బంపర్ ఆఫర్ ఇచ్చాడు. ఇందుకు సంబంధించి ఆ ఓనర్‌కు ఓనర్ ఈమెయిల్ నుంచే మెయిల్ చేశాడు. నిన్న నేను మీ ల్యాప్‌టాప్ కాజేశాను. నా కనీస అవసరాలు తీర్చుకోడానికి డబ్బులేక ఈ పని చేశా. మీరు ఓ పరిశోధనకు సంబంధించిన పనిలో బిజీగా ఉన్నారని నాకు తెలుసు. అందుకే దానికి సంబంధించిన ఫైల్స్‌ను మీకు పంపాను. ఇంకేదైనా మీ ల్యాప్‌టాప్ నుంచి మీకు ముఖ్యమైనవి పంపించాల్సి ఉంటే నాకు వెంటనే చెప్పండి. ఎందుకంటే నేను ఈరోజు(సోమవారం) ల్యాప్‌టాప్‌ను వేరే వ్యక్తికి అమ్మేస్తున్నాను. అందుకు ఓ కస్టమర్ రెడీగా ఉన్నాడు. చివరిగా క్షమించండి అంటూ మెయిల్ చేశాడు. దీన్ని ల్యాప్‌టాప్ ఓనర్ ట్విట్టర్‌లో షేర్ చేస్తూ.. ఆయన నా ల్యాప్‌టాప్ దొంగిలించి.. నా ఈమెయిల్ నుంచి నాకు మెయిల్ చేసి.. నాకే ఆఫర్ ఇస్తున్నారు. ఈ పరిస్థితికి నవ్వాలో లేక ఏడ్వాలో తెలియడం లేదని ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది.