కర్ణాటకకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే కి ఓ మహిళ న్యూడ్ వీడియో కాల్ చేసిన సంఘటన వెలుగులోకి వచ్చింది. రాష్ట్ర బీజేపీకి చెందిన ఎమ్మెల్యే జీహెచ్ తిప్పారెడ్డి(75)కి ఓ మహిళ వాట్సాప్ వీడియో కాల్ చేసింది. తనకు వచ్చిన వాట్సాప్ కాల్ లిఫ్ట్ చేసిన వెంటనే సదరు మహిళ నగ్నంగా దర్శనమివ్వడంతో అవాక్కవ్వడం బీజేపీ ఎమ్మెల్యే వంతైంది.
దీంతో ఎమ్మెల్యే తిప్పారెడ్డి క్షణాల్లోనే కాల్‌ను కట్ చేశారు. కాసేపటికే ఆమె ఎమ్మెల్యే ఫోన్‌కు అసభ్యకరంగా ఉన్న ఓ వీడియోను పంపింది. దీంతో ఎమ్మెల్యే తిప్పారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ.. మొదట తనకు కాల్ చేశారని, తాను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేదన్నారు.
ఆ తర్వాత కొద్ది నిమిషాలకే మరో కాల్ వచ్చిందన్నారు. ఓ మహిళ నగ్నంగా వీడియో కాల్ మాట్లాడేందుకు ప్రయత్నించగా, కాల్ కట్ చేసినట్లు పేర్కొన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు ఎమ్మెల్యే తెలిపారు.