Home / SLIDER / గొర్రెల పంపిణీ పథకము దేశానికి ఆదర్శం -డా. దూదిమెట్ల బాలరాజు యాదవ్

గొర్రెల పంపిణీ పథకము దేశానికి ఆదర్శం -డా. దూదిమెట్ల బాలరాజు యాదవ్

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలోని రంగారెడ్డి  జిల్లా ఉప్పల్ నియోజకవర్గం చెంగిచెర్లలో గొర్రెల ఫెడరేషన్ ద్వారా నడపబడుతున్న పశువధశాలను మరియు జాతీయ మాంస పరిశోధనా సంస్థను సందర్శించిన రాష్ట్ర షీప్ అండ్ గోట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డా. దూదిమెట్ల బాలరాజు యాదవ్ గారు.తెలంగాణ ప్రభుత్వము ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గొర్రెల పంపిణీ పథకము ద్వారా ఇప్పటివరకు 83 లక్షల గొర్రెలను గొల్ల కురుమ యాదవ కుటుంబాలకు చెందిన 3.94 లక్షల మంది లబ్ధిదారులకు అందజేయడం జరిగింది. ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమం ఎంతో మంచి ఫలితాలను ఇస్తుంది. గొర్రెల పంపిణీ పథకము చేపట్టిన తరువాత భారత ప్రభుత్వము చేపట్టిన 20వ పశు గణన లెక్కల ప్రకారం, గొర్రెల సంఖ్యలో మన రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానాన్ని ఆక్రమించింది. ఈ విధంగా అభివృద్ధి చెందిన గొర్రెల పెంపక రంగాన్ని ప్రోత్సహించడంలో భాగంగా రాష్ట్ర గొర్రెల మరియు మేకల ఫెడరేషన్ చైర్మన్ శ్రీ డాక్టర్ దూదిమెట్ల బాలరాజు యాదవ్ ఈరోజు చెంగిచెర్లలో గొర్రెల ఫెడరేషన్ ద్వారా నడపబడుతున్న పశువధశాలను సందర్శించడం జరిగింది.

నాణ్యమైన గొర్రెల మాంసాన్ని వినియోగదారులకు అందించాలని సత్సంకల్పంతో స్థాపించబడిన ఈ వదశాలను సందర్శించి గొర్రెల మరియు మేకల స్లాటర్ జరిగే తీరుతెన్నులను పరిశీలించారు. ఈ వదశాలలో యంత్రాల ద్వారా జరిగే స్లాటర్ను పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా శ్రీ డాక్టర్ దూదిమెట్ల బాలరాజు యాదవ్ గారు మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారి మరియు గౌరవ మంత్రివర్యులు శ్రీ తలసాని శ్రీనివాస యాదవ్ గారి ఆదేశాల ప్రకారము రాష్ట్రంలో గొర్రెల మార్కెట్ ల ఏర్పాటు మరియు మాంస ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు చేయుటకు అవసరమైన అన్ని చర్యలను ఫెడరేషన్ ద్వారా తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. వీటి ద్వారా ప్రజలకు నాణ్యమైన మాంసాన్ని సరసమైన ధరలకు అందించడమే కాక ప్రభుత్వం ద్వారా గొర్రెల మరియు మేకల మార్కెట్ల బలోపేతానికి అవసరమైన చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది.గొర్రెల అభివృద్ధి పథకము చేపట్టకముందు రాష్ట్రానికి రోజూ 700 నుంచి 800 లారీల గొర్రెలు దిగుమతి అవుతుండగా ప్రస్తుతము వాటి సంఖ్య 60 నుంచి 70 లారీలకు తగ్గినది అని తెలిపారు.

తదనంతరము వారు జాతీయ మాంస పరిశోధనా సంస్థను సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా జాతీయ మాంస పరిశోధన సంస్థ డైరెక్టర్ మరియు సీనియర్ సైంటిస్టులతో జరిగిన సమావేశంలో గౌరవ చైర్మన్ గారు మాట్లాడుతూ మాంస పరిశోధనా సంస్థ యొక్క సేవలను ఉపయోగించుకుని మరింత నాణ్యమైన మాంసాన్ని ప్రజలకు అందుబాటులోకి తేవడం జరుగుతుందని మరియు గ్రామాల్లో ఉన్న ఉత్సాహవంతమైన నిరుద్యోగ యువతకు జాతీయ మాంస పరిశోధన ద్వారా సరియైన సాంకేతిక శిక్షణ ఇప్పించి వారికి స్వయం ఉపాధి కూడా కల్పించడం జరుగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా సంగారెడ్డి జిల్లా ఇర్కొడ గ్రామంలో గౌరవ మంత్రివర్యులు శ్రీ తన్నీరు హరీష్ రావు గారి కృషితో ఏర్పాటు చేసిన సమీకృత మాంస కేంద్ర తరహాలో ఇతర ప్రాంతాలలో కూడా ఇటువంటి సమీకృత మాంస కేంద్రాలను ఏర్పాటు చేయడానికి కృషి చేస్తామని చైర్మన్ తెలిపారు. ఈ సందర్భంగా జాతీయ మాంస పరిశోధన సంస్థ వారు తయారుచేసిన మొబైల్ మీట్ (మీట్ ఆన్ వీల్స్) వాహనాన్ని పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా జాతీయ మాంస పరిశోధనా సంస్థ వారు నాణ్యమైన మాంస ఉత్పత్తి కోసం చేస్తున్న కృషిని ప్రశంసించారు. దీనికి సంబంధించిన సమగ్రమైన ప్రణాళికను రూపొందించడానికి త్వరలో ఒక సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుందని ఈ సమావేశంలో తీసుకొని నిర్ణయాల ఆధారంగా తదుపరి కార్యాచరణ ఉంటుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ విభాగానికి చెందిన డాక్టర్ వెంకటయ్య గౌడ్, డాక్టర్ సాయిరాజ్ ,మహమూద్ తదితరులు పాల్గొన్నారు..

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat