Home / MOVIES / క్రేజీ కాంబినేషన్ లో రౌడీ ఫెలో

క్రేజీ కాంబినేషన్ లో రౌడీ ఫెలో

ఇటీవల లైగర్ లాంటి ప్లాప్ మూవీ తర్వాత టాలీవుడ్ స్టార్ హీరో.. రౌడీ ఫేలో..   విజయ్‌ దేవరకొండ సినిమాల వేగాన్ని పెంచారు. ప్రస్తుతం ఆయన శివ నిర్వాణ దర్శకత్వంలో ‘ఖుషి’ చిత్రంలో నటిస్తున్నారు. సమంత కథానాయిక. వచ్చే ఏడాది విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా అనంతరం ‘జెర్సీ’ ఫేమ్‌ గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో విజయ్‌ దేవరకొండ ఓ సినిమా చేయబోతున్నట్లు తెలిసింది.

తాజా సమాచారం ప్రకారం సెన్సిబుల్‌ డైరెక్టర్‌ శేఖర్‌ కమ్ములతో విజయ్‌  ఓ సినిమా కోసం సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిసింది. వీరిద్దరి మధ్య ఎప్పటి నుంచో చక్కటి స్నేహ సంబంధాలున్నాయి. శేఖర్‌ కమ్ముల దర్శకత్వం వహించిన ‘లైఫ్‌ ఈజ్‌ బ్యూటీఫుల్‌’ చిత్రంలో విజయ్‌ దేవరకొండ చిన్న పాత్రలో నటించారు. అయితే ఇటీవలే వీరిద్దరి మధ్య కథా చర్చలు కూడా జరిగాయని, త్వరలో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌ అనౌన్స్‌ చేయొచ్చని ఫిల్మ్‌నగర్‌లో వార్తలు వినిపిస్తున్నాయి.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat