Home / MOVIES / ఓటీటీలోకి ఓరి దేవుడా..?

ఓటీటీలోకి ఓరి దేవుడా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇటీవల యంగ్ హీరోల జోష్ కొనసాగుతుంది.. చిన్న హీరోలగా ఎంట్రీచ్చి మరి స్టార్ హీరోలతో పోటిపడుతున్నారు హిట్ సినిమాలను ప్రేక్షకులకు అందించడంలో. అలాంటి హీరోల సరసన నిలిచే యంగ్ అండ్ స్మార్ట్ హీరో విశ్వక్ సేన్. ఈ హీరోకి ఈ ఏడాది బాగా అచ్చు వచ్చినట్లుంది.

గత ఏడాది పాగల్ వంటి డిజాస్టర్ తర్వాత ఇప్పుడు ఆశోకవనంలో అర్జున కళ్యాణం వంటి బ్లాక్ బస్టర్ హిట్ తో మంచి ప్రారంభం మొదలైంది. ప్రస్తుతం అదే ఊపుతో అక్టోబర్ నెలలో విడుదలైన  ‘ఓరి దేవుడా’  తొలి రోజు నుండి పాజిటీవ్‌ టాక్‌తో ఈ సినిమా మంచి వసూళ్ళను సాధించింది. వెంకటేష్‌ కీలకపాత్రలో నటించిన ఈ చిత్రానికి అశ్వత్‌ మరిముత్తు దర్శకత్వం వహించాడు.

పీవిపీ సినిమాస్‌, శ్రీ వెంక‌టేశ్వ‌రా క్రియేష‌న్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంలో విశ్వక్‌కు జోడీగా మిథిలా పాల్కర్‌, ఆశా భట్‌ హీరోయిన్‌లుగా నటించారు. పూరి జగన్నాధ్ గెస్ట్‌ రోల్‌ పోషించిన ఈ సినిమాకు లియోన్‌ జేమ్స్‌ సంగీతం అందించాడు.ఇదిలా ఉంటే ఈ సినిమా ఓటీటీ రిలీజ్‌ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.తాజాగా ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో గతరాత్రి నుండి స్ట్రీమింగ్‌ అవుతుంది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat