కళ్యాణ్ రామ్ డ్యూయల్ రోల్ గా సోషియో ఫాంటసీ కథాంశంతో ‘బింబిసార’ చిత్రంతో అందరి దృష్టిని ఆకర్షించారు యువ దర్శకుడు వశిష్ట. పరిమిత బడ్జెట్లోనే ఆకట్టుకునే హంగులతో సినిమాను రూపొందించి ప్రశంసలందుకున్నారు. తాజాగా ఆయన రామ్‌చరణ్‌తో ఓ సినిమాకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది.
ఇప్పటికే వీరిద్దరి మధ్య చర్చలు పూర్తయ్యాయని, పీరియాడిక్ కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారని సమాచారం. పాన్ ఇండియా మూవీగా తీర్చిది ద్దేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. ప్రస్తుతం రామ్‌చరణ్.. శంకర్ దర్శకత్వంలో దిల్‌రాజు రూపొందిస్తున్న చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. షూటింగ్ తుది దశకు చేరుకుంది. ఈ సినిమా పూర్తయిన తర్వాత వశిష్టతో చేయబోయే సినిమా పట్టాలెక్కుతుందని తెలిసింది.