Home / MOVIES / అల్లు అర్జున్ కు మరో అత్యున్నత అవార్డు

అల్లు అర్జున్ కు మరో అత్యున్నత అవార్డు

  ఎర్ర చంద‌నం స్మగ్లింగ్ నేప‌థ్యంలో తెర‌కెక్కిన పుష్ప చిత్రానికి క్రియేటీవ్‌ జీనియస్‌ సుకుమార్‌ దర్శకత్వం వహించగా భారీ అంచ‌నాల మ‌ధ్య గ‌తేడాది డిసెంబ‌ర్ 17న విడుద‌లైన పుష్ప చిత్రం బాక్సాఫీస్ ద‌గ్గ‌ర క‌లెక్ష‌న్ల సునామీని సృష్టించింది. ముఖ్యంగా హిందీలో ఎలాంటి అంచ‌నాల్లేకుండా విడుద‌లై బాక్సాఫీస్ వ‌ద్ద ఘ‌న విజ‌యం సాధించింది. ఈ చిత్రంలో హీరోగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించగా.. ఆయనకు జోడీగా నేషనల్ క్రష్  రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటించింది.

మ‌ల‌యాళ స్టార్ హీరో ఫాహ‌ద్ ఫాజిల్ ప్ర‌తినాయ‌కుడి పాత్ర‌లో న‌టించాడు. ప్రస్తుతం సినీ ప్రేక్షకులు పుష్ప-2 కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు.‘పుష్ప’ సినిమాతో అల్లు అర్జున్ క్రేజ్‌ ఖండాంతరాలు దాటింది. ఈ  సినిమాతో అల్లుఅర్జున్‌కు జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది. ముఖ్యంగా దక్షిణాదిన బన్నీకు విపరీతమైన క్రేజ్‌ వచ్చింది. పుష్ప రాజ్‌గా బన్నీ నటనకు ప్రేక్షకులు థియేటర్‌లకు బ్రహ్మరథం పట్టారు. ఇక ఈ సినిమాలో అల్లుఅర్జున్ నటనకు ఇప్పటికే పలు ఉన్నత అవార్డులు రాగా.. ఇప్పుడు బన్నీ మరో అత్యున్నత అవార్డును అందుకున్నాడు.

తాజాగా అల్లుఅర్జున్‌ ప్రతిష్టత్మక GQ MOTY-2022 ‘లీడింగ్‌ మ్యాన్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ అవార్డును గెలుచుకున్నాడు. ఈ అవార్డును గెలుచుకున్న తొలి తెలుగు హీరో బన్నీ కావడం విశేషం. ఈ అవార్డు రావడంతో బన్నీ ఫ్యాన్స్‌ ఖుషీ అవుతున్నారు. ఇప్పటికే అల్లు అర్జున్ ఇండియన్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డును గెలుచుకున్నాడు. ఈ అవార్డు పొందిన తొలి దక్షిణాది హీరోగా అరుదైన ఘనత సాధించాడు.

 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat