Home / MOVIES / జూనియర్ ఎన్టీఆర్ కోసం పవన్ మూవీ టైటిల్

జూనియర్ ఎన్టీఆర్ కోసం పవన్ మూవీ టైటిల్

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో.. ఇటీవల విడుదలైన ఆర్ఆర్ఆర్ తో మంచి ఊపు మీదున్న హీరో నందమూరి తారకరామారావు. ప్రస్తుతం ఆయన అభిమానులతో పాటుగా తెలుగు సినీ ప్రేక్షకులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న తాజా చిత్రం ‘NTR30’. గతంలో బంపర్ హిట్స్ సాధించిన బ్లాక్ బస్టర్ మూవీ జనతా గ్యారేజ్ దర్శకుడు   కొరటాల శివ ఈ మూవీకి  దర్శకత్వం వహించనుడటంతో ప్రేక్షకులు ఎగ్‌జైట్‌మెంట్‌తో ఉన్నారు. 

ఇటీవలే మేకర్స్ కొరటాల శివ, సాబు సిరిల్‌, సినిమాటోగ్రాఫర్ రత్నవేలు ప్రీ ప్రొడక్షన్ పనులలో నిమఘ్నమైనట్లు ఫోటోను రిలీజ్‌ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం చిత్రబృందం ప్రీ ప్రొడక్షన్‌ పనులను మరింత వేగవంతం చేసిందట. ఎట్టి పరిస్థుతుల్లో ఈ సినిమాను డిసెంబర్‌లో సెట్స్ మీదకు తీసుకెళ్ళాలని మేకర్స్ ప్లాన్‌ చేస్తున్నారట.ఇదిలా ఉంటే ఈ సినిమా టైటిల్‌కు సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది.

ఈ చిత్రానికి ‘దేవర’ అనే టైటిల్‌ను చిత్రబృందం పరిశీలనలో ఉంచినట్లు టాక్‌. అయితే గతంలో ఈ టైటిల్‌ను బండ్ల గణేష్‌ పవన్‌ సినిమా కోసం రిజస్టర్ చేయించాడట. కాగా ఇప్పుడు కొరటాల శివ ఈ పేరును అనుకుంటున్నాడట. ఇందులో నిజమెంతుందో తెలియాలంటే మేకర్స్‌ నుండి అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే. ఈ సినిమా మెడికల్‌ మాఫీయా నేపథ్యంలో తెరకెక్కనుందట. పాన్‌ ఇండియా స్థాయిలో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని యువసుధ ఆర్ట్స్‌, ఎన్‌టీఆర్‌ ఆర్ట్స్ బ్యానర్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రంలో తారక్‌కు జోడీగా జాన్వీ కపూర్‌ నటించనున్నట్లు టాక్‌. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచంద్రన్‌ సంగీతం అందిస్తున్నాడు.

 

 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat