అమెరికాలోని డల్లాస్‌లో నిర్వహించిన ఎయిర్‌షోలో దారుణం చోటుచేసుకుంది. వెటర్స్ గౌరవార్థం మూడు రోజుల పాటు ఎయిర్‌షో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రెండు యుద్ధ విమానాలు ఎయిర్‌షో చేసేందుకు గాల్లో ఎగరగా రెండు ఢీ కొన్నాయి. ఈ ఘటనలో ఇప్పటివరకు ఆరుగురు సిబ్బంది మృతి చెందారు. ఈ విషయాన్ని ది ఫెడరల్ ఎవియేషన్ అడ్మినిస్ట్రేషన్ ఓ ప్రకటనలో తెలిపింది.
రెండో ప్రపంచ యుద్ధ కాలం నాటి రెండు విమానాలు బోయింగ్ బీ-17 బాంబర్ విమానం, బెల్ పీ-63 కింగ్ కోబ్రా విమానం ఎయిర్ షోలో పాల్గొన్నాయి. ఈ విమానాలు రెండు భూమికి తక్కువ ఎత్తులో ఎగురుతుండగా ఈ ఘటన జరిగింది. వెంటనే సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. ఈ ఎయిర్‌షో వీక్షేంచేందుకు సుమారు 6 వేల మంది చేరుకున్నారు. అయితే కార్యక్రమాన్ని చూడటానికి వచ్చేవారిలో ఎవరికీ ఏమీ కాలేదు.