తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఓ విషాదం చోటు చేసుకుంది. తెలుగు సినిమా ఇండస్ట్రీకి మూల స్థంభాల్లో ఒకటైన సూపర్ స్టార్ కృష్ణ ఈరోజు మంగళవారం తెల్లారుజామున ఉదయం నాలుగు గంటలకు కన్నుమూశారు. దీంతో ఇండస్ట్రీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కృష్ణ మరణంపై తెలంగాణ రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు తీవ్ర సంతాపం ప్రకటించారు.
దాదాపు 350కి పైగా సినిమాల్లో నటించిన అగ్రశ్రేణి నటుడని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కొనియాడారు. తెలుగు సినిమా పరిశ్రమలో అనేక ప్రయోగాలతో నూతన ఒరవడిని సృష్టించారన్నారు. తెలుగు సినిమా పరిశ్రమకు 50 ఏండ్ల పాటు అమూల్యమైన సేవలందించారని పేర్కొన్నారు.
తెలుగు సినీ చరిత్రలో బుర్రిపాలం బుల్లోడు నిలిచిపోతారని, ఆయన మరణం తెలుగు సినీ పరిశ్రమకు తీరని లోటన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థిన్నట్లు పేర్కొన్నారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.