Home / MOVIES / స్వీటీ అభిమానులకు శుభవార్త

స్వీటీ అభిమానులకు శుభవార్త

 తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ హీరో.. మన్మధుడు అక్కినేని నాగార్జున హీరోగా వచ్చిన ‘సూపర్‌’ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైన సీనియర్ స్టార్ హీరోయిన్.. హాట్ బ్యూటీ అనుష్క.. ఆ తర్వాత వరుస సినిమాల్లో నటించడమే కాకుందా భారీ విజయాలను సాధించడంతో స్వీటీ అనతి కాలంలోనే అగ్ర కథానాయికగా స్టార్ స్టేటస్‌ దక్కించుకుంది.

దాదాపు దశాబ్ధన్నర కాలానికి పైగా వెండితెర జేజమ్మగా దక్షిణాదిన ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ .. వరుస సినిమాల్లో  లేడీ ఓరియెంటెడ్‌ పాత్రలకు కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచింది. గతంలో విడుదలైన చిత్రం  నిశ్శబ్ధం  నేరుగా ఓటీటీలోనే రిలీజైంది. దాంతో అనుష్క అభిమానులు ఆమె సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

ప్రస్తుతం అనుష్క, నవీన్ పొలిశెట్టితో కలిసి ఓ రోమ్‌-కామ్‌ సినిమా చేస్తుంది. ఇటీవలే రిలీజైన ఈమె ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌కు ప్రేక్షకుల నుండి విశేష స్పందన వచ్చింది. కాగా అనుష్క నెక్స్ట్‌ సినిమాకు సంబంధించిన ఓ బిగ్‌ అప్‌డేట్‌ తాజాగా బయటకు వచ్చింది.

ఏ.ఎల్‌ విజయ్‌ దర్శకత్వంలో అనుష్క తన 49వ సినిమాను చేయనున్నట్లు అధికారిక ప్రకటన వచ్చింది. ఈ చిత్రం అవుట్‌ అండ్‌ అవుట్‌ యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కనున్నట్లు దర్శకుడు ఏ.ఎల్‌ విజయ్‌ తెలిపాడు. మహిళా ప్రధానంగా సాగనున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సెట్స్‌ మీదకు వెళ్లనుంది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat