Home / POLITICS / Cm Jagan : మరోసారి మంచి మనసు చాటుకున్న సీఎం జగన్… చిన్నారి వైద్యం కోసం !
cm jagan distribute rythu bharosa

Cm Jagan : మరోసారి మంచి మనసు చాటుకున్న సీఎం జగన్… చిన్నారి వైద్యం కోసం !

Cm Jagan : ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మరోసారి గొప్ప మనసు చాటుకున్నారు. నరసన్నపేట పర్యటనలో భాగంగా కార్యక్రమానికి వెళ్తున్న క్రమంలో కాన్వాయ్‌ నుంచి బాధితులను గమనించి వాహనం నిలిపివేసి వారిని పరామర్శించారు. ఈ సందర్భంగా విజయనగరం జిల్లా చిన్న శిర్లాం గ్రామానికి చెందిన మీసాల కృష్ణవేణి తమ కుమార్తె ఇంద్రజకు (7) అవసరమైన వైద్య సాయం అందించాలని సీఎం వైఎస్‌ జగన్‌కు విజ్ఞప్తి చేశారు. ఇంద్రజ అనారోగ్య సమస్యను తెలుసుకున్న సీఎం జగన్‌… వెంటనే ఇంద్రజకు అవసరమైన పూర్తి వైద్య సహాయం అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

దీంతో ఆ చిన్నారి తల్లిదండ్రులు సీఎం జగన్ కు ధన్యవాదాలు తెలుపుతూ కన్నీటి పర్యంతం అయ్యారు. తమ ఆర్దిక పరిస్థితి బాగోలేని కారణంగా తమ బిడ్డకు మరుగైన వైద్యం అందించలేకపోయామని… సీఎం మంచి మనసుతో తమ బిడ్డ ఆరోగ్యం కోసం వెంటనే స్పందించడం చాలా మంచి విషయం అన్నారు. ఆధునిక డిజిటల్‌ రెవెన్యూ రికార్డులు సిద్ధమైన గ్రామాల్లో రైతులకు భూ హక్కు పత్రాల పంపిణీ కార్యక్రమాన్ని సీఎం జగన్‌ నరసన్నపేటలో ప్రారంభించారు.

ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ… రూ. 1000 కోట్ల వ్యయం, 4,500 సర్వే బృందాలు, ఎయిర్ క్రాఫ్టులు, హెలికాప్టర్లు, డ్రోన్లు, 70 కార్స్ బేస్ స్టేషన్లు, 2,000 రోవర్ల ద్వారా అత్యాధునిక సాంకేతికలతో రీసర్వే చేయబడుతుంది. ప్రతి భూకమతాన్ని సర్వే చేసి అత్యంత కచ్చితత్వంతో అక్షాంశ, రేఖాంశాలు, గుర్తింపు సంఖ్య, సమగ్రంగా భూ వివరాలు QR కోడ్ తో కూడిన భూ కమత పటం భూ యజమానులకు జారీ చేస్తాం. ప్రతి స్థిరాస్తికీ ప్రభుత్వ హామీతో కూడిన శాశ్వత పత్రం ఇస్తాం అని జగన్ చెప్పారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat