సీనియర్ నటుడు.. యువరత్న నందమూరి బాలకృష్ణ హీరోగా.. ప్రగ్యా జైశ్వాల్ హీరోయిన్ గా బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చి ఘన విజయం సాధించిన మూవీ అఖండ.. గతేడాది విడుదలై అద్భుత విజయాన్ని సాధించిన సంగతి విదితమే.
ధార్మిక వాణిజ్య అంశాలు కలబోసిన కథాంశంతో ప్రేక్షకుల అభిమానంతో సంపాదించుకుంది ఈ మూవీ. ఈ సినిమా సీక్వెల్ పై గత కొన్ని రోజులుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా ఈ వార్తలపై క్లారిటీ ఇచ్చింది చిత్రం యూనిట్. హీరో బాలకృష్ణ మాట్లాడుతూ అఖండ -2 మూవీ సిద్ధమవుతుంది. దీనికి సంబంధించిన కథ సిద్ధమవుతుంది అని తెలిపారు. సరైన సమయంలో ఈ సినిమా గురించి ప్రకటన చేస్తామని బాలకృష్ణ తెలిపారు.