టాలీవుడ్ స్టార్ సింగర్ రేవంత్ ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 6లో ప్రేక్షకులను అలరిస్తున్నారు. మొదటి నుంచి తన ఆటతీరుతో మంచి మార్కులే కొట్టేస్తున్నారు. అయితే రేవంత్ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లే సమయంలో ఆయన సతీమణి అయిన అన్విత నిండు గర్భిణి. ఇలాంటి సమయంలో భార్యను వదిలి వచ్చానని కూడా రేవంత్ చాలా సార్లు బాధపడ్డాడు.
ఇక హౌస్‌లో ఉన్న సమయంలోనే రేవంత్ భార్య అన్విత సీమంతం కూడా జరిగింది . ఆ వీడియోను హౌస్ లో ప్లే చేసి రేవంత్‌ను హ్యాపీ చేశారు బిగ్ బాస్. ఈ వీడియో చూస్తూ రేవంత్ చాలా ఎమోషనల్ అయ్యాడు. తాజగా ఆయన భార్య అన్విత పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చింది.
ఈ విషయాన్ని రేవంత్ సన్నిహితులు సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. రేవంత్, అన్విత ఈ ఏడాది ఫిబ్రవరి 7న వివాహబంధంతో ఒక్కటయ్యారు. కొవిడ్ వ్యాప్తి దృష్ట్యా కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే ఈ వేడుకకు హాజరయ్యారు. రేవంత్ తండ్రయిన వార్త తెలుసుకున్న అభిమానులు, పలువురు సెలబ్రిటీలు కంగ్రాట్స్ చెబుతూ పోస్టులు పెడుతున్నారు.