Home / POLITICS / Politics : కృష్ణ జలాల వివాదంలో ఒక నిర్ణయానికి వచ్చిన తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలు..

Politics : కృష్ణ జలాల వివాదంలో ఒక నిర్ణయానికి వచ్చిన తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలు..

Politics ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల విషయంలో ఇన్నాళ్ళకి ఒక అభిప్రాయం కుదిరింది… శ్రీశైలం జలాశయం రూల్ కర్వ్స్‌లో మార్పులు చేసేందుకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు సుముఖత వ్యక్తం చేశాయని కృష్ణా యాజమాన్య బోర్డు జలాశయాల పర్యవేక్షక కమిటీ కన్వీనర్‌ రవికుమార్‌ పిళ్లై వెల్లడించారు.

కృష్ణా జలాల వివాద విషయంలో తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల మధ్య ఒక ఏకాభిప్రాయం వచ్చింది.. శ్రీశైలం జలాశయం రూల్ కర్వ్స్‌లో మార్పులు చేసేందుకు ఇరు రాష్ట్రాలు అంగీకారం తెలిపాయని.. రవికుమార్‌ పిళ్లై అన్నారు.. తాజాగా హైదరాబాద్ జలసౌధలో కృష్ణా నదీ యాజమాన్య బోర్డు రిజర్వాయర్‌ మేనేజ్‌మెంట్‌ కమిటీ కన్వీనర్‌ ఆర్కే పిళ్లై అధ్యక్షతన జరిగిన సమావేశానికి తెలంగాణ నీటిపారుదల శాఖ ఈఎన్సీ మురళీధర్‌, కేఆర్‌ఎంబీ సభ్యుడు మౌంతాగ్‌, జెన్‌కో డైరెక్టర్‌ వెంకటరాజాం, ఏపీ జలవనరులశాఖ ఈఎన్సీ నారాయణరెడ్డి హాజరయ్యారు.

నాగార్జున సాగర్‌ రూల్‌ కర్వ్స్‌పై ఆంధ్ర జల సంఘం ప్రకారం నిర్ణయం తీసుకుంటామని రవికుమార్‌ పిళ్లై వెల్లడించారు. ఇన్నాళ్లు జలవిద్యుత్ వినియోగంపై వివాదాస్పదంగా నెలకొన్న ఈ విషయం ఇన్నాళ్లకు సర్దుమనిగిందని చెరుసగా వినియోగానికి ఆమోదం తెలిపాయని అన్నారు… మిగులు జలాల విషయంలో సమావేశంలో స్పష్టత వచ్చిందన్న పిళ్లై.. ప్రాజెక్టులు పూర్తిగా నిండి ఓవర్‌ఫ్లో అయ్యాకే వరదను మిగులు జలాల కింద పరిగణించాలని ఇరు రాష్ట్రాలు సూచించాయని తెలిపారు.

ఇన్నాళ్లు కృష్ణా నది విషయంలో ఎన్నో వివాదాలు తలెత్తయి అయితే ఇప్పటికీ ఈ విషయంపై ఒక నిర్ణయానికి వచ్చాయి ఈ రెండు రాష్ట్రాలు.. తెలుగు రాష్ట్రాల్లోకి కృష్ణా నది ప్రవేశించాక.. సరిహద్దు నుంచి ప్రతి నీటి చుక్కా లెక్కించాలన్న నిర్ణయానికి రెండు రాష్ట్రాలు ఆమోదం తెలిపినట్లు రవికుమార్‌ పిళ్లై పేర్కొన్నారు. రెండు రాష్ట్రాల అంగీకారంతో నివేదికను ఖరారు చేస్తామన్న ఆయన.. అనంతరం శాశ్వత ప్రాతిపదికన రిజర్వాయర్‌ మేనేజ్‌మెంట్‌ కమిటీ ఏర్పాటు చేసే అవకాశముందన్నారు.

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat