Breaking News
Home / SLIDER / పల్లె దవాఖానాలతో ప్రజల చెంతకే వైద్యం..

పల్లె దవాఖానాలతో ప్రజల చెంతకే వైద్యం..

పరకాల నియోజకవర్గంలోని ఆత్మకూరు మండలంలోని పెద్దాపురం గ్రామంలో రూ 16 లక్షల తో పల్లె దవాఖానాను శాసన సభ్యులు చల్లా ధర్మారెడ్డి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి   మాట్లాడుతూ… పల్లె దవాఖానల ఏర్పాటుతో గ్రామీణ ప్రాంతాల ప్రజలపై ఆర్థిక భారం తగ్గిపోయిందన్నారు.

గ్రామంలో పల్లె దావకాన ఏర్పాటు వల్ల వైద్య పరంగా గ్రామ ప్రజలకు ఇబ్బందులు తొలిగిపోతాయని గుర్తు చేశారు. నగరాలకు వెళ్లి కార్పొరేట్ హాస్పిటల్ లో వైద్యం కోసం లక్షలు ఖర్చుపెట్టే భారం తగ్గుతుందని అన్నారు.ఈ పల్లె ధవాఖానాలతో ఉచితంగా వైద్య, పరీక్షలు, అదే స్థాయిలో మందులు పంపిణీ చేస్తామన్నారు.

పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించడం తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం లక్ష్యమని,ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నేతృత్వంలో వైద్య శాఖ మంత్రి హరీశ్ రావు గారి సారధ్యంలో ప్రభుత్వ దవాఖాన లో ప్రైవేట్ దవాఖానల కంటే మెరుగైన వైద్యం అందిస్తున్నామని అన్నారు.ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ , మండల ప్రజాప్రతినిధులు మరియు మండల తెరాస నాయకులు మరియు తదితరులు పాల్గొన్నారు….

MOST RECENT

Facebook Page

Advertisement

medyumlar aviator hile paralislot.com medyumlar lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri
  • canlı casino siteleri eburke.org - - medyumlar