Home / MOVIES / బాలయ్య అభిమానులకు శుభవార్త

బాలయ్య అభిమానులకు శుభవార్త

‘అఖండ’ విజ‌యంతో ఫుల్ జోష్‌లో ఉన్న సీనియర్ స్టార్ హీరో.. యువరత్న నంద‌మూరి బాల‌కృష్  అదే జోష్‌తో వీర సింహా రెడ్డి చిత్రాన్ని చేస్తున్నాడు. హిట్ చిత్రాల దర్శకుడు గోపిచంద్ మ‌లినేని ద‌ర్శక‌త్వంలో వస్తున్న ఈ చిత్రానికి సంబంధించి ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి.. మంచి మాస్ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా వచ్చే సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానున్నది.

ఇక ఈ చిత్రం తర్వాత బాలయ్య, అనిల్ రావిపూడితో సినిమా చేయ‌నున్నాడు. ఇప్పటికే అనౌన్స్‌మెంట్ కూడా వ‌చ్చేసింది. అనిల్ ఈ చిత్రాన్ని అవుట్ అండ్ అవుట్ యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్‌గా రూపొందిస్తున్న‌ట్లు ఇటీవ‌లే తెలిపాడు. ప్రస్తుత ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరపుకుంటున్న ఈ చిత్రం మరో రెండు, మూడు సెట్స్ మీదకు వెళ్ళనుంది.

ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది. ఈ సినిమాలో హీరోయిన్‌గా ప్రియాంక జవాల్కర్‌ను మేకర్స్ ఎంపిక చేశారట. ఇటీవలే చిత్రబృందం ప్రియాంకను సంప్రదించగా.. ఆమె కూడా వెంటనే ఓకే చెప్పిందట. ఇక ఇప్పటికే ప్రియాంకపై ఫోటో షూట్‌ కూడా నిర్వహించినట్లు సమాచారం. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుంది. తండ్రీ, కూతురు సెంటిమెంట్‌తో సాగే ఈ సినిమాలో బాలయ్య కూతురుగా శ్రీలీల నటించనుంది. షైన్‌ స్క్రీన్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాకు థమన్‌ సంగీతం అందిస్తున్నాడు.

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat