Home / SLIDER / డిసెంబర్ 9 తెలంగాణ ప్రజలకు చారిత్రాత్మక దినం

డిసెంబర్ 9 తెలంగాణ ప్రజలకు చారిత్రాత్మక దినం

తెలంగాణ రాష్ట్ర సమితిని భారతీయ రాష్ట్ర సమితిగా ఎన్నికల కమిషన్ ప్రకటించడానికి స్వాగతిస్తున్న,డిసెంబర్ 9 తెలంగాణ ప్రజలకు చారిత్రాత్మక దినం,తెలంగాణ ప్రజల ఆకాంక్షల్ని గౌరవించి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రోజు ..కేసీఆర్ గారు చావో రేవో తేల్చుకోవడానికి అమరణ నిరాహార దీక్ష ప్రారంభించి డిసెంబర్ 9న కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీతో విరమించిన ప్రత్యేక దినం ..

అనేక పోరాటాల ద్వారా త్యాగాల ద్వారా రాజకీయ ప్రక్రియ ద్వారా ఏర్పాటైన తెలంగాణ రాష్ట్రం గత 8 ఏళ్లుగా అభివృద్ధిలో సంక్షేమంలో దేశంలోనే మొదటి వరుసలో నిలబడి దేశవ్యాప్తంగా కెసిఆర్ గారి నాయకత్వంలో జరుగుతున్న అభివృద్ధి అన్ని రాష్ట్రాలకు విస్తరించాలని ప్రజలు కోరుకుంటున్న నేపథ్యంలో భారత ప్రజలకి ఒక ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీగా భారతీయ రాష్ట్ర సమితి కేసీఆర్ నాయకత్వంలో ప్రారంభం కావడం ఆహ్వానించదగ్గ పరిణామం,తెలంగాణ కోసం కలబడిన,నిలబడిన వర్గాలు భారతీయ జనతా పార్టీ అనుసరిస్తున్న ఆర్థిక అరాచక విధానాలకు నిరసనగా ఒక్కటి కావలసిన సందర్భం.

మతం పేర ప్రజల మధ్య విద్వేషాలు రగల్చుతూ,గంగా జమున తహసీబును విధ్వంసం చేసే కుట్రలను మరియు స్వతంత్ర వ్యవస్థల్ని పార్టీ రాజకీయాల కోసం ఉపయోగించుకుంటున్న రాజకీయాలకు వ్యతిరేకంగా భారతీయ రాష్ట్ర సమితికి మద్దతిచ్చి దేశంలో జరిగే గుణాత్మకమైన మార్పుకు అందరం సహకరిద్దాం..భారతీయ రాష్ట్ర సమితి కేసీఆర్ గారి నాయకత్వం లో భవిష్యత్తులో అద్భుతమైన విజయాలు సాధించి దేశ ప్రజల ఆకాంక్షల్ని తీర్చాలని కోరుకుంటున్నాం  అని అన్నారు దేవి ప్రసాద్ రావు, తెలంగాణ TNGO సంఘం మాజీ అధ్యక్షుడు, మాజీ తెలంగాణ రాష్ట్ర బెవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat