తెలంగాణలో ఉద్యోగాల భర్తీకి మరో భారీ నోటిఫికేషన్ వెలువడింది. మొత్తం 1,392 జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీకి టీఎస్‌పీఎస్సీ శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో మల్టీ జోన్-1 పరిధిలో 724, మల్టీ జోన్-2లో 668 పోస్టులు ఉన్నాయి. మొత్తం 27 సబ్జెక్టుల్లో పోస్టులు భర్తీ చేయనున్నారు.
ఈ నెల 16 నుంచి జనవరి 6 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని టీఎస్‌పీఎస్సీ సెక్రటరీ అనితా రామచంద్రన్ తెలిపారు. అభ్యర్థులు https://www.tspsc.gov.in వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలని సూచించారు.