Home / MOVIES / కైకాల సినీ ప్రస్థానం గురించి మీకు తెలుసా..?

కైకాల సినీ ప్రస్థానం గురించి మీకు తెలుసా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన త్యంత సీనియర్ నటుడు.. విలన్.. హీరో.. నిర్మాత అయిన యావత్ తెలుగు సినీ లోకం యముడు అని పిలుచుకునే కైకాల సత్యనారాయణ (87)  ఈ రోజు శుక్రవారం ఉదయం నాలుగంటలకు హైదరాబాద్ ఫిల్మ్ నగర్ లో తన నివాసంలో కన్నుమూశారు. అయితే కైకాల సినిమా ప్రస్థానం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

  • కైకాల సత్యనారాయణ నటించిన మొదటి చిత్రం: సిపాయి కూతురు
  • చివరి చిత్రం: మహర్షి
  • పౌరాణిక, సాంఘిక, చారిత్రక, జానపద చిత్రాల్లో పాత్రలతో మెప్పించారు
  • 28 పౌరాణిక, 51 జానపద, 9 చారిత్రక చిత్రాల్లో నటించారు
  • 200 మందికిపైగా దర్శకులతో పని చేశారు
  • కైకాల నటించిన సినిమాల్లో 223 చిత్రాలు 100 రోజులు ఆడాయి
  • 59 సినిమాలు అర్ధ శతదినోత్సవాలు జరుపుకున్నాయి
  • 10 చిత్రాలైతే ఏకంగా సంవత్సరం పాటు ఆడాయి
  • విఠలాచార్య దర్శకత్వంలో తొలి సారి ప్రతినాయకుడి వేషం వేశారు
  • కనకదుర్గ పూజ మహిమ చిత్రంతో ప్రతినాయకుడిగా మారారు
  • ఎన్టీఆర్ అగ్గిపిడుగు చిత్రంతో కైకాల సినీ జీవితం మలుపు తిరిగింది
  • ఎన్టీఆర్‌తో కలిసి కైకాల సత్యనారాయణ 101 చిత్రాల్లో నటించారు
  • ఎన్టీఆర్‌తో పోరాట సన్నివేశాల్లో పోటాపోటీగా నటించి మెప్పించారు
  • యమగోల, యమలీల చిత్రాల్లో యముడిగా అలరించారు
  • పౌరాణికాల్లో రావణుడు, దుర్యోధనుడు, యముడు, ఘటోత్కచుడు పాత్రలు పోషించారు
  • సాంఘిక చిత్రాల్లో రౌడీ, తండ్రి, తాత పాత్రల్లో నటించారు
  • రమా ఫిల్మ్ ప్రొడక్షన్ సంస్థను స్థాపించిన కైకాల సత్యనారాయణ
  • కొదమ సింహం, బంగారు కుటుంబం, ముద్దుల మొగుడు చిత్రాలను నిర్మించారు
  • 1994లో బంగారు కుటుంబం చిత్రానికి నంది పురస్కారం అందుకున్నారు
  • 2011లో రఘుపతి వెంకయ్య పురస్కారం అందుకున్నారు.
  • నీవా పాండవ పత్ని.. సంభాషణ అంటే కైకాల చాలా ఇష్టం
  • 1996లో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన కైకాల తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మచిలీపట్నం నుంచి లోక్ సభకు ఎన్నికయ్యారు

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat