దేశంలో కొత్తగా గత 24 గంటల్లో 201 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కేంద్ర ఆరోగ్యశాఖ ఈ విషయాన్ని తెలిపింది. దేశవ్యాప్తంగా ప్రస్తుతం 3397 యాక్టివ్ కేసులు ఉన్నట్లు ఆరోగ్యశాఖ పేర్కొన్నది.
వైరస్ నుంచి రికవరీ అవుతున్న రేటు 98.8 శాతంగా ఉన్నట్లు ప్రభుత్వం తెలిపింది.గత 24 గంటల్లో 184 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. రోజువారీ పాజిటివ్ రేటు 0.15 శాతంగా ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ చెప్పింది. గత 24 గంటల్లో లక్ష కోవిడ్ టీకాలను ఇచ్చినట్లు కేంద్రం తెలిపింది.