Home / POLITICS / Politics : జిహెచ్ఎంసి మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో ఉద్రిక్తత.. మేయర్ ను చుట్టుముట్టిన కార్పొరేటర్లు..

Politics : జిహెచ్ఎంసి మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో ఉద్రిక్తత.. మేయర్ ను చుట్టుముట్టిన కార్పొరేటర్లు..

Politics తెలంగాణ రాష్ట్రంలో జరిగిన జిహెచ్ఎంసి మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో ఉద్రిక్తత నెలకొంది సభలో బిజెపి కాంగ్రెస్ కార్పొరేటర్లు మేయర్ ను చుట్టుముట్టారు జిహెచ్ఎంసి పనుల్లో ఎమ్మెల్యేల పెత్తనం ఏంటి అంటూ మేయర్ ను నిలదీశారు..

హైదరాబాద్లో జరిగిన జిహెచ్ఎంసి మున్సిపల్ కౌన్సిల్ సమావేశం లో ఘర్షణ చోటుచేసుకుంది.. సభ ప్రారంభమైన కాసేపటికి బిజెపి కార్పొరేటర్లు కాంగ్రెస్ కార్పొరేటర్లు మేయర్ పొడి అని చుట్టుముట్టటమే కాకుండా జిహెచ్ఎంసి పనులు ఎమ్మెల్యేలు ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నారు అంటూ నిలదీశారు.. అలాగే ఈ కార్యక్రమంలో గతవారం ఉప్పల్లో మేయర్ విజయలక్ష్మిని సొంత పార్టీ నేతలే అడ్డుకున్నారు దీనికి సంబంధించిన ఫోటోలు పట్టుకొని ఆందోళనకు దిగారు అలాగే హైదరాబాద్లో ఇప్పటికి ఎక్కడ పనులు అక్కడే ఉన్నాయి అంటూ అధికార పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు అయితే ఇలా జరిగేటప్పటికీ మేయర్ విజయలక్ష్మి ఒక్కసారిగా ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు ఒక మహిళ మేయర్ పట్ల ఇదేనా ప్రవర్తించే తీరు అంటూ ప్రశ్నించారు ఇంతలోనే కాంగ్రెస్ మేయర్లు సైతం ఆమెను చుట్టుముట్టారు. వీరంతా గోషామహల్‌లో కుంగిన నాలా ఫొటోలతో మేయర్ ఛాంబర్‌ వద్ద ఆందోళనకు దిగారు.

ఈ సందర్భంగా గానే వచ్చే ఏడాదికి సంబంధించిన జిహెచ్ఎంసి కౌన్సిల్ అంచనా బడ్జెట్ను మేయర్ ఆమోదించారు అయితే దీనిపై కూడా బిజెపి సభ్యులు విరుచుకుపడ్డారు అలాగే రాష్ట్ర ప్రభుత్వం నుంచి గ్రాంట్లు రాకపోవడంపై బీజేపీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బడ్జెట్‌పై సమగ్రంగా చర్చించాలంని కాంగ్రెస్ కార్పొరేటర్లు పట్టుబట్టారు. అయితే దీనికి సంబంధించిన ఎజెండాను కార్పొరేటర్ అందరికీ పంపించినప్పుడు ఎందుకు మాట్లాడలేదు అంటూ మేయర్ ప్రశ్నించారు ఇప్పటికైతే బడ్జెట్ ఆమోదం అయిపోయిందని స్టాండింగ్ కమిటీ కూడా ఆమోదం పొందిందని తెలిపారు..

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat