టీమిండియాకు చెందిన డేరింగ్ డ్యాషింగ్ బ్యాట్స్ మెన్ .. వికెట్ కీపర్ అయిన రిషభ్ పంత్ తీవ్ర రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ఆయన ప్రయాణిస్తోన్న కారు రూర్కీ దగ్గర అదుపు తప్పి డివైడర్ ను ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో రిషభ్ పంత్ కు తీవ్ర గాయాలయ్యాయి. రోడ్డు ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు క్రికెటర్ రిషభ్ పంత్ ను దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తరలించారు.పంత్ ఆరోగ్య పరిస్థితిపై నేషనల్ క్రికెట్ అకాడమీ డైరెక్టర్ వీవీఎస్ లక్ష్మణ్ క్లారిటీ ఇచ్చారు.
‘దేవుడి దయతో పంత్ ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. పంత్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా. Get well soon Champ’ అని ట్వీట్ చేశాడు. అయితే పంత్ తల, వీపుపై గాయాలైనట్లు తెలుస్తోంది. కాలు విరిగినట్లు సమాచారం. ప్రస్తుతం పంత్ చికిత్స పొందుతున్నాడు.