Home / POLITICS / Politics : ఖమ్మం బహిరంగ సభకు రానున్న కేజ్రీ వాల్..

Politics : ఖమ్మం బహిరంగ సభకు రానున్న కేజ్రీ వాల్..

Politics తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్ లో సమావేశం అయ్యారు ఈ సందర్భంగా ఖమ్మం జిల్లా ప్రజా ప్రతినిధులతో మాట్లాడారు ఈ నెల 18న జరగనున్న బీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభను అందరూ విజయవంతం చేయాలని సూచించారు..

ముఖ్యమంత్రి కేసీఆర్ తాజాగా ఖమ్మం జిల్లా ప్రజా ప్రతినిధులతో భేటీ అయ్యారు ఈ సందర్భంగా దాదాపు మూడు గంటల పాటు వీరితో చర్చలు జరిపిన ఈయన త్వరలోనే జరగనున్న పార్టీ బహిరంగ సభను విజయవంతం చేయాలని తెలిపారు.. అలాగే ఈ సందర్భంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి వ్యవహారంపై కూడా సీఎం కేసీఆర్‌ చర్చించినట్లు తెలిసింది. పొంగులేటి పార్టీ వీడినా నియోజకవర్గంలో క్యాడర్‌ చేజారకుండా చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యేలకు కేసీఆర్‌ సూచించారు. ఖమ్మం జిల్లాలో పార్టీ బలోపేతానికి నేతలంతా కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. త్వరలోనే ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో అందరూ కలిసి పార్టీ విజయానికి దోహదం చేయాలని అన్నారు..

అయితే ముఖ్యమంత్రి కేసీఆర్.. టీఆర్‌ఎస్‌ పార్టీ బీఆర్‌ఎస్‌గా మారిన తర్వాత తొలిసారిగా ఖమ్మంలో భారీ బహిరంగ సభ నిర్వహణకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈనెల 18న ఖమ్మంలో జరగనున్న మీటింగ్ లో నూతన కలెక్టరేట్ ను ప్రారంభించనున్నారు ముఖ్యమంత్రి.. అలాగే ఈ బహిరంగ సభకు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, పంజాబ్‌ సీఎం భగవంత్‌ మాన్, కేరళ సీఎం పినరయి విజయన్, ఉత్తరప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌లను కేసీఆర్‌ ఆహ్వానిస్తున్నట్లు తెలుస్తుంది..

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat