Home / SLIDER / సత్తా ఉంది కాబట్టే పాన్‌ ఇండియాకు పోతున్నం -మంత్రి కేటీఆర్

సత్తా ఉంది కాబట్టే పాన్‌ ఇండియాకు పోతున్నం -మంత్రి కేటీఆర్

కంటెంట్‌ ఉన్న తెలుగు సినిమా పాన్‌ ఇండియా స్థాయిలో పేరు తెచ్చుకుంటున్నప్పుడు సత్తా గల నాయకుడు కేసీఆర్‌ గారు జాతీయ స్థాయి రాజకీయాలకు వెళ్లడంలో తప్పేముంది? మాలో కంటెంట్‌ ఉంది కాబట్టి మేమూ పాన్‌ ఇండియాకు పోతున్నం’ అన్నారు రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కె.తారక రామరావు. సోమవారం హైదరాబాద్‌ ప్రసాద్‌ ల్యాబ్స్‌లో దర్శకుడు దశరథ్‌ రచించిన ‘కథా రచన’ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ పుస్తకాన్ని రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ముద్రించింది. ఈ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్‌ ముఖ్య అతిథిగా పాల్గొని పుస్తక తొలి ప్రతిని ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ…‘స్క్రిప్ట్‌ బాగున్న చిత్రాలే ప్రేక్షకాదరణ పొందుతాయి. ‘శివ’, ‘అర్జున్‌ రెడ్డి’, ‘మహానటి’ లాంటి చిత్రాలు చూసినప్పుడు గొప్ప అనుభూతికి లోనయ్యాను. నాకు క్రియేటివ్‌ కంటెంట్‌ అంటే ఇష్టం. తెలుగు, ఇంగ్లీష్‌, బిజినెస్‌ ఇలా రోజూ కనీసం పదీ పన్నెండు దిన పత్రికలు చదువుతాను. పండుగల సమయంలో మరుసటి రోజు దినపత్రిక రాకుంటే ఆ రోజంతా ఏదో కోల్పోయినట్లు అనిపిస్తుంటుంది. మంచి పుస్తకం కనిపిస్తే తప్పకుండా చదివేస్తా. కథా రచన అనే పుస్తక రచనతో దర్శకుడు దశరథ్‌ మంచి ప్రయత్నం చేశారు.

తెర వెనక సినిమా కోసం పని చేసే ఎంతోమందికి ఈ పుస్తకం ఉపయోగపడుతుంది. సాంస్కృతిక శాఖ వేరు సినిమా వేరు అనుకోవడం సరికాదని చూపిస్తూ ఈ పుస్తకాన్ని ప్రింట్‌ చేసిన తెలంగాణ లాంగ్వేజ్‌ అండ్‌ కల్చరల్‌ డిపార్ట్‌మెంట్‌కు అభినందనలు. బెన్‌ అఫ్లిక్స్‌, మాట్‌ డామన్‌ స్క్రీన్‌ప్లే రాసిన ‘గుడ్‌ విల్‌ హంటింగ్‌’ అనే హాలీవుడ్‌ సినిమాకు ఆస్కార్‌ వచ్చింది. నటులైన బెన్‌ అఫ్లిక్స్‌, మాట్‌ డామన్‌ రచనకు ఆస్కార్‌ ఎందుకు ఇచ్చారు అనుకుని ఆ సినిమా చూశాను. ఒక కథను గొప్పగా తెరపై ఆవిష్కరించేది స్క్రీన్‌ప్లే అని అప్పుడు తెలిసింది. సినిమాలకే కాదు ఒక స్పీచ్‌ ఇవ్వాలన్నా దాన్ని కథలా శ్రోతలకు చెప్పాలి.

ఆనాడు కేసీఆర్‌ గారు పార్టీ పెట్టినప్పుడు ధన బలం, కండ బలం, కుల బలం, మీడియా బలం లేవు. ఆయనకు ఉన్నది వాక్పటిమ మాత్రమే. కేసీఆర్‌ గారు ప్రజల భాషలో వాళ్ల గుండెకు తాకేలా ప్రసంగించి ఆకట్టుకునేవారు. తెలంగాణ నైసర్గిస స్వరూపాన్ని లెక్కలతో సహా చెప్పేవారు. ఆయనకు ఇవన్నీ ఎలా తెలుసుని ఆశ్చర్యమనిపించేది. ఒక గొప్ప వక్త ప్రసంగం వెనక పరిశ్రమ, అభ్యాసం ఎంతో ఉంటుంది. కరోనా టైమ్‌లో కేసీఆర్‌ గారి ప్రెస్‌మీట్‌లను ప్రజలు టీవీల ముందు నుంచి కదలకుండా చూసేవారు. క్రికెట్‌ మ్యాచ్‌ల కన్నా ఆయన ప్రెస్‌మీట్‌లకు ఎక్కువ టీఆర్పీ రేటింగ్‌ వచ్చి ఉంటుంది’ అన్నారు.

కంటెంట్‌ ఉంటే హిట్‌ అవుతుంది.ఇప్పుడు దేశంలో తెలుగు సినిమా హవా నడుస్తున్నదని, కొద్ది రోజుల్లోనే దేశానికే కాదు దక్షిణాసియా మొత్తానికి హైదరాబాద్‌ ఫిలిం హబ్‌గా మారబోతున్నదని మంత్రి కేటీఆర్‌ విశ్వాసం వ్యక్తం చేశారు. ‘హైదరాబాద్‌ ఇంటర్నేషనల్‌ ఫిలిం ఫెస్టివల్‌ ఏర్పాటు చేసేందుకు చిత్ర పరిశ్రమ సహకారం తీసుకుంటాం. ఏ పని చేసినా విమర్శించేవాళ్లు ఉంటారు.

ఈ ఎనిమిదిన్నరేండ్లలో తెలంగాణలో అసాధ్యమనుకున్న ఎన్నో పనులు చేసి చూపించాం. కంటెంట్‌ ఉంటే ఏ సినిమా అయినా దేశవ్యాప్తంగా హిట్‌ అవుతుంది. నాయకుడైనా, పార్టీ అయినా విజయం సాధిస్తుంది’ అని కేటీఆర్‌ పేర్కొన్నారు. దర్శకుడు దశరథ్‌ మాట్లాడుతూ…‘సినిమా రచన మీద సమగ్రమైన పుస్తకం తీసుకురావాలని ఈ రచన చేశాను. నా ప్రయత్నానికి అండగా నిలబడిన తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ, ప్రభుత్వానికి కృతజ్ఞతలు. మా కార్యక్రమానికి వచ్చి పుస్తక ఆవిష్కరణ చేసిన కేటీఆర్‌ గారికి ధన్యవాదాలు చెబుతున్నా’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో దర్శకులు నాగ్‌ అశ్విన్‌, వీవీ వినాయక్‌, హరీష్‌ శంకర్‌, వీఎన్‌ ఆదిత్య, కాశీ విశ్వనాథ్‌, ప్రేమ్‌ రాజ్‌ తదితరులు పాల్గొన్నారు

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat