Home / SLIDER / “కంటివెలుగు”తో వెలుగులు”

“కంటివెలుగు”తో వెలుగులు”

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కంటివెలుగు రెండవ విడత కార్యక్రమంలో భాగంగా ఆత్మకూరు మండల కేంద్రంలోని గ్రామపoచాయతీ కార్యాలయంలో నిర్వహిస్తున్న క్యాంపును ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గారు సందర్శించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే కంటిపరిక్షలు చేసుకొని కళ్లద్దాలు తీసుకున్నారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గారు మాట్లాడుతూ..కంటిచూపు మందగించినా దవాఖానకు పోలేక అంధకారంలో మగ్గుతున్న పేదలకు,వృద్ధులను కంటివెలుగుతో ఆదుకొనేందుకు ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చెప్పట్టిందని అన్నారు.

అవసరమైన వారందరికీ కంటి అద్దాలు అందిస్తూ,అవరసరమైతే శస్త్రచికిత్స చేస్తున్నారన్నారు.2018లో కంటివెలుగు కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు స్వీకారం చుట్టారని ఈ నెల 18న ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు,జాతీయ నాయకుల చేతుల మీదుగా రెండవ విడత కంటివెలుగును ఖమ్మంలో ప్రారంభించుకోవడం సంతోషకరమన్నారు.మొ న్నటి సభలో ఢిల్లీ పంజాబ్ ముఖ్యమంత్రులు మన కంటి వెలుగు కార్యక్రమాన్ని వారి రాష్ట్రాలలో ప్రారంభిస్తామనడం శుభపరిణామమని ఎమ్మెల్యే అన్నారు.సిఎం కేసీఆర్ గారి నాయకత్వంలో కంటివెలుగు, ఆసరా,కళ్యాణలక్ష్మి, షాధిముభారక్, ఒంటరి మహిళలకు పెన్షన్ లాంటి మరెన్నో గొప్ప సంక్షేమ కార్యక్రమాలను చేపడుతున్నామన్నారు.

కంటివెలుగు కార్యక్రమం ద్వారా కంటిచూపు సరిగాలేని నిరుపేదలందరు ఈ శిబిరాలకి వెళ్లి పరీక్షలు చేపించుకోవాలని కోరారు.తాను కూడా తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న కళ్ళద్దాలను కంటి పరీక్షలు చేసుకొని తీసుకున్నానని తెలిపారు.జనవరి 18 నుంచి జూన్‌ 30 వరకు జరిగే రెండో దశ కంటి వెలుగు కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు. కంటి వెలుగు కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం 250 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుందని తెలిపారు. ప్రపంచంలోనే సామూహిక కంటి వెలుగు కార్యక్రమం దేశంలో మరెక్కడా లేదన్నారు.ఇంత మంచి కార్యక్రమాన్ని అందరం కలిసికట్టుగా పనిచేసి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మండల & గ్రామ ప్రజాప్రతినిధులు,అధికారులు,బి.ఆర్.ఎస్.నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat