Home / POLITICS / MINISTER TALASANI: యునైటెడ్‌ క్రిస్టియన్‌ అండ్‌ పాస్టర్స్‌ సమావేశంలో పాల్గొన్న మంత్రి తలసాని
Minister Talasani said that the govt is working for the development and welfare of all communities

MINISTER TALASANI: యునైటెడ్‌ క్రిస్టియన్‌ అండ్‌ పాస్టర్స్‌ సమావేశంలో పాల్గొన్న మంత్రి తలసాని

MINISTER TALASANI: హైదరాబాద్ నారాయణగూడ చర్చిలో యునైటెడ్‌ క్రిస్టియన్‌ అండ్‌ పాస్టర్స్‌ సమావేశంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు దానం నాగేందర్, ముఠా గోపాల్, పలువురు ప్రతినిధులు పాల్గొన్నారు.

అన్ని వర్గాల అభివృద్ధి, సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. ఐకమత్యంతోనే అభివృద్ధి సాధించగలమని…. రాష్ట్రంలో ఉన్న క్రిస్టియన్స్ అందరూ ఏకం కావాలని ఆకాంక్షించారు.

అన్ని జిల్లాలు, మండలాలవారీగా కమిటీలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. కమిటీలు ఉంటే సమస్యలను సులభంగా పరిష్కరించుకోగలమని చెప్పారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన వారికి కమిటీల ద్వారా అందించవచ్చని పేర్కొన్నారు.

తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ కార్యక్రమాలు…… దేశంలో మరెక్కడా అమలుకావడం లేదన్నారు. క్రిస్టియన్ల ఆత్మగౌరవాన్ని మరింత పెంచే విధంగా ఉప్పల్ భగాయత్‌లో రెండు ఎకరాలు, క్రిస్టియన్ భవనం నిర్మాణానికి ప్రభుత్వం 10కోట్ల రూపాయలు ఇచ్చిందని మంత్రి తెలిపారు. పేదింటి ఆడపిల్లల వివాహాల కోసం షాదీ ముబారక్, కల్యాణ లక్ష్మి అందిస్తున్నామని గుర్తు చేశారు. విదేశాల్లో ఉన్నత విద్య కోసం 20లక్షల రూపాయల ఆర్థిక సాయం అందిస్తున్నామని తెలిపారు.

శాంతిభద్రతల విషయంలో రాష్ట్రం……దేశంలోనే మొదటిస్థానంలో మంత్రి తలసాని ఉందన్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat