తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం అన్ని వర్గాల్లో అభివృద్ధి చెందుతున్నదని ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య అన్నారు. తెలంగాణ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని చెప్పారు.
కరువు, వలసలతో అల్లాడిన తెలంగాణ నేడు సస్యశ్యామలంగా మారిందన్నారు. శానససభలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ప్రవేశపెట్టారు.
దేశానికి తెలంగాణ రోల్‌మోడల్‌గా మారిందని చెప్పారు. సీఎం కేసీఆర్ నిరంతర కృషితోనే ఇది సాధ్యమైందన్నారు. కంటివెలుగు లాంటి కార్యక్రమాన్ని పంజాబ్, ఢిల్లీలో చేపడతామని ఆప్ అధినేత కేజ్రీవాల్ ప్రకటించారని గుర్తుచేశారు.