తెలంగాణ ముఖ్యమంత్రి.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై బీజేపీకి చెందిన నిజామాబాద్ ఎంపీ అర్వింద్ విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో ఇటీవల జరిగిన సంఘటనలపై ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించకపోవడంపై ఆయన ఫైర్ అయ్యారు.
వీధి కుక్కల దాడిలో బాలుడు బలైతే ముఖ్యమంత్రి ఎక్కడున్నారని ప్రశ్నించారు. ర్యాగింగ్ భూతానికి మెడికో ప్రీతి ఇబ్బంది పడుతుంటే సీఎం ఎక్కడ అని నిలదీశారు.
ఈ రెండు ఘటనలపై ఆయన మాట్లాడకపోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఆడపిల్లలకు రక్షణ లేకుండా పోయిందని ఆయన ఈ సందర్భంగా ఆరోపించారు.