Home / SLIDER / రానున్న ఎన్నికల్లో వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే

రానున్న ఎన్నికల్లో వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే

రానున్న ఎన్నికల్లో వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే… అందులో ఎటువంటి సందేహం లేదు…మూడోసారి కూడా కేసీఆర్ నే సీఎం కావడం ఖాయమని బీఆర్ఎస్ లోక్ సభా పక్ష నేత, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు స్పష్టం చేశారు. ఆదివారం సత్తుపల్లి పట్టణంలో జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో నామ, ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య తో కలసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు వార్డుల్లో జరిగిన సభల్లో నామ మాట్లాడుతూ రాష్ట్రంలో పెద్ద ఎత్తున జరిగిన అభివృద్ధి,సంక్షేమమే బీఆర్ ఎస్ పార్టీకి పట్టం కడతాయని అన్నారు. దేశంలో ఎక్కడా జరగని అభివృద్ధి తెలంగాణా లో జరిగిందని అన్నారు.తెలంగాణ రాకముందు రాష్ట్రం ఎలా ఉంది..

ఇప్పుడెలా ఉందో అందరికీ తెలిసిందేనని పేర్కొన్నారు. పల్లెలు పట్టణాలలో పోటీపడుతూ అభివృద్ధిలో దూసుకుపోతున్నాయని అన్నారు. 19 గ్రామాలకు జాతీయ అవార్డులు వచ్చాయన్నారు.ఇది కేసీఆర్ సృష్టించిన ఘన చరిత్ర అన్నారు. ఇప్పుడు దేశం యావత్తు కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటుందని తెలిపారురానున్న ఎన్నికలలో అభివృద్ధి కాముకులకే పట్టం కట్టాలన్నారు.రానున్న కాలంలో కేసీఆర్ కు అండగా నిలవాలన్నారు. ఎన్నికలప్పుడు వచ్చి మాయ, మోసపు మాటలు చెప్పే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని, అటువంటి వారి ని నమ్మవొద్దన్నారు.పార్లమెంట్ లో తెలంగాణ అభివృద్ధి గురించి మాట్లాడినప్పుడు నోరు మెదపని వారు ఇప్పుడు ఇక్కడకు వచ్చి అవాకులు చవాకులు పేలుతున్నారని అన్నారు.

వారు పరిపాలిస్తున్న రాష్ట్రాల్లో లేని అభివృద్ధి ఒక్క తెలంగాణా లోనే ఉందన్నారు. మళ్లీ బీఆర్ఎస్ మంచి మెజార్టీ తో గెలుస్తుందని, మరింత అభివృద్ధి చేసుకుందామని నామ తెలిపారు.ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య మాట్లాడుతూ కేసీఆర్, కేటీఆర్ విజన్ తో సత్తుపల్లి పట్టణాన్ని అన్ని రకాలుగా ఖమ్మం జిల్లా కేంద్రంతో దీటుగా అభివృద్ధి చేసుకుంటున్నామని చెప్పారు. ఒక్క ఏడాదిలో రూ.100 కోట్ల అభివృద్ధి పనులు చేసుకోవడం మన అదృష్టమన్నారు.అందరి దీవెనలతో ,సమిష్టి కృషితో సత్తుపల్లి ని మరింత అభివృద్ధి చేసుకుందామని చెప్పారు. గతంలో ఇంత అభివృద్ధి లేదన్నారు. రాబోయే కాలంలో కనీవినీ ఎరుగని రీతిలో అభివృద్ధి జరుగుతుందన్నారు. కేసీఆర్ , కేటీఆర్ సమర్ధ నాయకత్వం వల్లనే ఇదంతా సాధ్యమవుతుందన్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat