తాను ఏ పార్టీలో చేరతాననేది త్వరలోనే ప్రకటిస్తానని ఖమ్మం జిల్లాకు చెందిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఈరోజు సోమవారం రాష్ట్రంలోని ఖమ్మం జిల్లా కల్లూరులో కార్యకర్తలతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి..
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అందరితో చర్చించి ఈనెలలోనే తన నిర్ణయం చెబుతానన్నారు. అలాగే సత్తుపల్లి అభ్యర్థిని కూడా త్వరలోనే ప్రకటిస్తానని పొంగులేటి స్పష్టం చేశారు. కాగా మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వైఎస్సార్టీపీలో చేరుతారనే ప్రచారం జరుగుతోంది.